Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీ వీ షో అంటో ఒక కప్పు టీ తాగడం లాంటిది కాదు: మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు టీవీ షోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''స్పైడర్" సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడుతూ..టీవీ షో అంటే ఒక కప్పు టీ తాగడం లాంటిది కాదని, టీవీ షోలను చేయాలంటే దానికి కొన

Advertiesment
No TV and no politics
, బుధవారం, 27 సెప్టెంబరు 2017 (20:13 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు టీవీ షోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''స్పైడర్" సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడుతూ..టీవీ షో అంటే ఒక కప్పు టీ తాగడం లాంటిది కాదని, టీవీ షోలను చేయాలంటే దానికి కొన్ని లక్షణాలుండాలన్నారు. అవన్నీ తన దగ్గర లేవని మహేష్ బాబు తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్స్ టీవీ షోలను చేయడంపై మహేష్ బాబు స్పందిస్తూ.. వారికి టీవీషోలు చేసే అర్హత, నైపుణ్యం వుందన్నాడు. 
 
టీవీ షోలు చేయడం కోసం వారు పెడుతున్న శ్రమకు హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్‌తో మహేశ్‌ టీవీ షోలు చేసే అవకాశమే లేదనే చర్చ మొదలైంది. అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చేది లేదని మహేష్ బాబు తేల్చేశారు. ఇతర హీరోల గురించి మహేష్ బాబు ఇంత సానుకూలంగా స్పందించడం ద్వారా ఆయనపై గౌరవం మరింత పెరిగిందని సినీ జనం అంటున్నారు. నో టీవీ.. నో పాలిటిక్స్ అనే సూత్రాన్ని మహేష్ బాబు ఫాలో చేస్తున్నారని సినీ జనం అంటున్నారు.
 
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా మహేశ్ కామెంట్స్‌పై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. హీరోల మధ్య ఇలాంటి సహృదయ వాతావరణం ఉండాలని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంకా చోప్రాకు స్థానం.. క్వాంటికో సీరియల్‌తో..