Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా ఏమైంది..? ఉన్న‌ట్టా...? లేన‌ట్టా..?

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (19:28 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స‌క్స‌ెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా చేస్తున్నారు. ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలాఉంటే... ఈ సినిమా త‌ర్వాత ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. 
 
ఎందుకంటే... మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌డానికి వెయిట్ చేస్తోన్న ద‌ర్శ‌కుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప‌ర‌శురామ్ మ‌హేష్ బాబుకి క‌థ చెప్పారు. లైన్ న‌చ్చ‌డంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌న్నారు. మ‌హ‌ర్షి సినిమా స‌క్స‌స్ అవ్వ‌డంతో వంశీ పైడిప‌ల్లితో మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. మ‌హేష్ బాబుతో సుకుమార్ కూడా సినిమా చేయాల‌నుకుంటున్నారు. అయితే.. వీరంద‌రి కంటే ముందు నుంచి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా మ‌హేష్ కోసం క‌థ రెడీ చేస్తున్నారు.
 
స‌రిలేరు నీకెవ్వ‌రు మ‌హేష్ బాబుకి 26వ సినిమా. 27వ సినిమా ప‌రశురామ్‌తో కానీ.. వంశీ పైడిప‌ల్లితో కానీ ఉండ‌చ్చు అని టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌ధ్యంలో సందీప్ రెడ్డితో మ‌హేష్ సినిమా ఉంటుందా..? ఉండ‌దా..? అనేది ఆస‌క్తిగా మారింది. ఇదే విష‌యం గురించి సందీప్‌ని అడిగితే... స్టోరీ లైన్‌ మహేష్‌కు చెప్పాను. ఆయ‌న‌కు లైన్ నచ్చటంతో పూర్తి కథ సిద్ధం చేయమన్నారు. ఫుల్ స్టోరీ చెప్పిన తరువాత సినిమాపై క్లారిటీ వస్తుందన్నారు. మ‌రి... మ‌హేష్ ఎప్పుడు సందీప్ ఫుల్ స్టోరీ వింటాడో..? ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments