Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక రాజ‌కీయాల‌కు దూర‌మా..? క్లారిటీ ఇచ్చిన రాముల‌మ్మ‌..!

Advertiesment
Vijayasanti
, మంగళవారం, 4 జూన్ 2019 (19:08 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌ెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రంలో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి న‌టిస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే...ఈ సినిమాలో విజయశాంతి నటిస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఆమె రాజకీయ జీవితంపై చాలామంది కామెంట్లు చేస్తున్నారు. 
 
విజయశాంతి సినిమాలపై దృష్టి పెట్టారని, రాజకీయాలకు దూరమైపోతారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై విజ‌య‌శాంతి ట్విట్ట‌ర్లో స్పందించారు. నేను 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తున్నానని ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి సానుకూల ప్రతిస్పందన వస్తుంది. నేను మరలా సినీరంగ ప్రవేశం చేయడంపై కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
సినిమాలలో నటిస్తే ఇక రాజకీయాలను పట్టించుకోరా అనే అనుమానం కొందరికి రావచ్చు. ఈ సందర్భంగా నేను ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. నాకు సినిమాల్లో నటించే అవకాశం ఆరు నెలల కిందటే వచ్చింది. కానీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తరఫున నన్ను స్టార్ క్యాంపెయినర్‌గాను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గాను నాకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. 
 
నాకు అప్పగించిన పని పూర్తయ్యేవరకు నేను సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదు. అది రాజకీయాలపై నాకున్న కమిట్మెంట్. నా రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఇదేవిధంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తేవాళ్లు కూడా ఉన్నారు. 2014-2018 వరకు కాంగ్రెస్‌లో రాములమ్మ యాక్టివ్‌గా లేరని కొందరు చేసే కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. దీనికి కూడా నా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. పార్టీ అప్పగించిన పని ఏదైనా నేను చిత్తశుద్ధితో చేశాను.
 
 ఎన్నికలకు ముందు నాలుగేళ్ల పాటు నేను పార్టీ చెప్పిన పనులను తూచా తప్పకుండా చేయడం వల్లే నాకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు అనే విషయాన్ని గుర్తించాలి. పార్టీ పరంగా చేసే పనులన్నీ ప్రజల్లోకి వచ్చి చేయకపోవచ్చు అంతమాత్రాన రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదు అంటూ సుదీర్ఘ‌మైన ట్వీట్లో చాలా స్పష్టంగా తెలియ‌చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాన్వీ నిక్కర్లు.. ''వెరీ వెరీ షార్ట్స్ షార్ట్స్''.. కత్రినా కైఫ్ కామెంట్స్