Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అమర్ అక్బర్ ఆంటోని''లో కిక్ రాజాతో నటించాలా? అంత ఇవ్వాల్సిందే: ఇలియానా

రవితేజ హీరోగా శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికల అవసరం ఉండగా, ఒక కథానాయికగా ఇలియానాను ఎంపిక చేసుకున్నారట. కిక్ సినిమాతో హిట్ పెయిర్‌గా గు

Webdunia
గురువారం, 24 మే 2018 (11:42 IST)
రవితేజ హీరోగా శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికల అవసరం ఉండగా, ఒక కథానాయికగా ఇలియానాను ఎంపిక చేసుకున్నారట. కిక్ సినిమాతో హిట్ పెయిర్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఈ జంట కలిసి నటించడం ప్రస్తుతం అంచనాలను పెంచేస్తుంది. 
 
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో ఇలియానా ఒకరు. తెలుగులో అగ్ర హీరోల జోడీ కడుతూ, యూత్‌ను ఒక ఊపు ఊపేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చిన ఇలియానా.. తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. ఇందుకోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. రవితేజ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. 
 
ఛాన్స్ దొరికిందని ఎగిరి గంతేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో నటించేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. ఇందుకోసం ఆమె 2 కోట్ల పారితోషికం డిమాండ్ చేయగా నిర్మాతలు అంగీకరించినట్టుగా సమాచారం. ఇంత గ్యాప్ తరువాత కూడా ఇలియానా పారితోషికం విషయంలో ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషం. గతంలో రవితేజ .. ఇలియానా కాంబినేషన్లో 3 సినిమాలు రాగా వాటిలో 'కిక్' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments