సుప్రీం హీరో ''తేజ్'' రిలీజ్ ఖరారు.. అనుపమ నటన సూపర్.. హిట్ ఖాయమా?

కరుణాకరన్ దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ''తేజ్''. ఈ సినిమా జూన్ 29న రిలీజ్ కానుందని ట్విట్టర్లో చిత్ర యూనిట్ ప్రకటించింది. కేఎస్ రామారావు నిర్మించిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటిక

Webdunia
గురువారం, 24 మే 2018 (10:28 IST)
కరుణాకరన్ దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ''తేజ్''. ఈ సినిమా జూన్ 29న రిలీజ్ కానుందని ట్విట్టర్లో  చిత్ర యూనిట్ ప్రకటించింది. కేఎస్ రామారావు నిర్మించిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ మంచి లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. 
 
తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ కరుణాకరన్ తేజ్ సినిమా తీయడంతో..ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్నా ఈ మూవీ ఆడియో కార్యక్రమంపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
 
ఈ సినిమా గురించి కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. నవతరం ప్రేమికుడిగా సాయిధరమ్‌ తేజ్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందన్నారు. కుటుంబ అనుబంధాలు మేళవించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని, అనుపమ పరమేశ్వరన్ నటన ఆకట్టుకుంటుందని వెల్లడించారు.
 
దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ, ఇది హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రం ఇదని చెప్పారు. గత కొంతకాలంగా రోటీన్‌ ఫార్ములా చిత్రాలతో ఫెయిల్యూర్స్‌ చవిచూస్తున్న సుప్రీం హీరోకు లవ్‌ స్టోరీల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌.. హిట్ ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే.. కొంత కాలం వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments