రవితేజ రెండు సినిమాలకు అంత తీసుకున్నాడా..?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం "నేల టిక్కెట్టు". కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన నేల టిక్కెట్టు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. మాస్
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం "నేల టిక్కెట్టు". కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన నేల టిక్కెట్టు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథాకథనాలతో ఈ సినిమా రూపొందినట్టుగా చెబుతున్నారు.
ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో ఆయన మూడు డిఫరెంట్ లుక్స్‌తో కనిపించనుండడం విశేషం.
ఇక ఈ సినిమాతో పాటు 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మిస్తుంది. ఈ రెండు సినిమాలకి కలిపి రవితేజ రూ.20 కోట్లు పారితోషికంగా అడిగాడట. అయితే... రూ.16 కోట్లకు డీల్ కుదిరినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలను ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారట.
రెండు సినిమాలకు రూ.16 కోట్లు రవితేజ తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. "రాజా ది గ్రేట్"తో ఫామ్‌లోకి వచ్చినా 'టచ్ చేసి చూడు'తో ఫ్లాప్ వచ్చింది. మరి... 'నేల టిక్కెట్టు' ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో..?