Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మో నాకు సిగ్గెక్కువ.. కానీ రవితేజ మాత్రం ''సిగ్గు'' అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి?

రవితేజ ఏమాత్రం సిగ్గుపడకుండా యాక్ట్ చేసేస్తాడు. తనకైతే యాక్టివ్‌గా సిగ్గును పక్కనబెట్టేసి యాక్ట్ చేయడం అంటే చాలా ఇబ్బందిగా వుంటుందని.. కానీ రవితేజ ఎంతమంది జనం ఉన్నా, ఎలాంటి పాత్ర చేయాలనుకున్నా సిగ్గు

అమ్మో నాకు సిగ్గెక్కువ.. కానీ రవితేజ మాత్రం ''సిగ్గు'' అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి?
, శుక్రవారం, 11 మే 2018 (10:29 IST)
మాస్ మహారాజా తాజా చిత్రం నేల టిక్కెట్. ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి తదితరులు నటించిన ఈ సినిమాకు ''ఫిదా'' ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ చిత్రం ఆడియో కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రవితేజ ఏమాత్రం సిగ్గుపడకుండా యాక్ట్ చేసేస్తాడు. తనకైతే యాక్టివ్‌గా సిగ్గును పక్కనబెట్టేసి యాక్ట్ చేయడం అంటే చాలా ఇబ్బందిగా వుంటుందని.. కానీ రవితేజ ఎంతమంది జనం ఉన్నా, ఎలాంటి పాత్ర చేయాలనుకున్నా సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు వచ్చి చాలా బలంగా నటించగలడని పవన్ చెప్పారు. అందుకే రవితేజ అంటే ఇన్స్‌స్పిరేషన్. ఈ సినిమా నేల టికెట్ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ తెలిపారు. 
 
తాను నటుడు కాకముందు వీధుల్లో తిరుగుతున్నప్పుడు నటుడిగా రవితేజ చూశానని.. ఆయన నవ్వుల వెనక.. పెర్ఫార్మెన్స్ వెనుక చాలా కృషి వుందని.. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, బాధలేక పోతే హాస్యం అనేది రాదు. అందుకే రవితేజగారు అంటే తనకు చాలా ఇష్టం.. గౌరవం అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహ‌బూబాతో హిట్ సాధించి ఆకాశ్ బిగ్ స్టార్‌గా ఎద‌గాలి: ప్ర‌భాస్‌(Video)