సింగిల్ ఆఫర్ కోసం పడరాని పాట్లుపడుతున్న హాట్ బ్యూటీ.. (video)

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (09:27 IST)
వెండితెరపై రాణించాలంటే.. అందాలు ఆరబోయాలి. హీరోలతో పాటు.. దర్శక నిర్మాతలతో సఖ్యతగా నడుచుకోవాలి. ఇలా ఉన్నప్పటికి.. ఆఫర్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాంటి పరిస్థితినే ఓ బ్యూటీఫుల్ హీరోయిన్ ఎదుర్కొంటోంది. ఒక్క ఛాన్స్ కోసం ఓ యేడాది కాలంగా ఆమె పడరాని పాట్లుపడుతోంది. ఆమె ఎవరో కాదు... హెబ్బా పటేల్. 
 
తెలుగు వెండితెరపై కెరటంలా ఎగిరిపడిన బ్యూటీ హెబ్బా. "కుమారి 21 ఎఫ్"తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. రాజ్ తరుణ్, నిఖిల్, రామ్ లాంటి యంగ్ హీరోలకి పర్‌ఫెక్ట్ జోడి అని కామెంట్స్ సొంతం చేసుకుంది. దానికి  తగ్గట్టే హెబ్బాకి మంచి ఆఫర్స్ వచ్చాయి. 
 
వరుణ్ తేజ్‌తో 'మిస్టర్', నిఖిల్‌తో 'కేశవ', అరుణ్ ఆదిత్‌తో '24 కిస్సెస్'లో నటించి బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో యూత్‌కి బాగానే కనెక్ట్ అయ్యింది. కానీ సినిమాల ఎంపికలో ముఖ్యంగా తన పాత్ర విషయంలో అస్సలు ఆలోచించకుండా వెళ్లిపోవడంతో ఇప్పుడు బాధపడుతోంది.
 
"24 కిస్సెస్'' సినిమాలో హెబ్బా ఓ రేంజ్‌లో ముద్దులు కురిపించినా ఆ ఘాటు ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది. ఇక కరోనా ఎఫెక్ట్ తన కెరీర్‌ని మరింత వెనక్కి నెట్టింది. సరిగ్గా ఇదేసమయంలో కృతి శెట్టి, నేహ శర్మ, కేతిక శర్మ వంటి యంగ్ బ్యూటీస్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి హెబ్బా ప్లేస్‌ని రీప్లేస్ చేసేస్తున్నారు.
 
తమ గ్లామర్‌తో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు. దీంతో హెబ్బా లాంటి వాళ్ళని హీరోయిన్లుగా చూసేవారే కరువయ్యారు. హెబ్బా పటేల్ గ్లామర్ హీరోయిన్ అలాగే టాలెంటెడ్ కూడా. అందానికి ఏం తక్కువ లేదు, అలాగే వాటిని ప్రదర్శించడానికి కూడా వెనుకాడే మనస్థత్వం కాదు. ఎలాంటి పాత్రలకైనా అడ్డు చెప్పదు. అయినా హెబ్బాకి టాలీవుడ్‌లో మంచి అవకాశాలు మాత్రం రావడం లేదు. 
 
ఇప్పుడామె స్థాయి స్పెషల్‌ సాంగ్‌లకు పడిపోయిందంటే.. హెబ్బా క్రేజ్‌ ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రామ్ నటిస్తున్న "రెడ్" సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఐటంగాళ్‌గానైనా హెబ్బా బిజీ అవుతుందేమో చూడాలి. అలాగే వెబ్‌ సిరీస్‌ల వైపు కూడా అమ్మడు అడుగేస్తుంది. అక్కడైనా ఆమె ఫేట్ మారుతుందో లేదో చూద్ధాం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tamil Nadu: కన్నతల్లినే హత్య చేసిన కొడుకు.. ఎందుకో తెలుసా?

అలాంటి వాడు చావడమే కరెక్ట్... వాడి శవం కూడా మాకొద్దు...

Hyderabad: కర్నూలు బస్సు ప్రమాదం..11 మంది మృతి.. 11మందికి తీవ్రగాయాలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments