Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిలో 40 ఏజ్ వారికి బాగా క‌నెక్ట్ అవుతారు.. ఆపైవారికీ న‌చ్చ‌వ‌చ్చు.. "డర్టీ హరి" హీరో

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (19:42 IST)
ఇప్పుడు యువ‌త తెలివితేట‌ల‌తోపాటు బ‌ద్ద‌క‌స్త‌లు కూడా వున్నారు. అలాగే రాముడు, రావ‌ణుడు లాంటివారు కాకుండా మ‌ధ్య‌స్తంగా కూడా వుంటారు. అలాంటి వ్య‌క్తిక‌థ‌తో  'డర్టీ హరి' రూపొందింద‌ని చిత్ర హీరో శ్రవణ్ రెడ్డి తెలిపారు. సోమ‌వారం విలేక‌రుల‌తో ఆయ‌న మాట్లాడారు. ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. 
 
సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లు. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 18న విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి హీరో శ్ర‌వ‌ణ్ రెడ్డి ఇంట‌ర్వ్యూ..
 
* మీ నేప‌థ్యం? 
హైద‌ర‌బాద్‌లో పుట్టి పెరిగినా 13 ఏళ్ళుగా ముంబైలో వున్నా. హిందీ టెలివిజ‌న్‌లో జీ, సోని కంపెనీకి చెందిన సీరియ‌ల్సులో న‌టించాను. ప‌లు వెబ్‌షోలు చేశాను. టైం ఆప్ ఇండియా చేసిన కొన్ని షోలు చేశాను. బాగా పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశాను. బాలీవుడ్‌లోనే న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వం ప‌ట్ల శిక్ష‌ణ తీసుకున్నా. 2019లో చేసిన ఓ వెబ్ సిరీస్‌ను చూసి ఎం.ఎస్‌.రాజు త‌న సినిమాకు హీరోగా స‌రిపోతాడ‌ని అడిగారు. అలా ఆయ‌న సినిమాలో ప‌నిచేశాను. 
 
* ఎం.ఎస్‌. రాజుగారి సినిమాలు చూశారా? 
రాజు చేసిన వ‌ర్షం, ఒక్క‌డు చిత్రాలు న‌న్నెంతో ఆక‌ట్ట‌కున్నాయి. అలాంటి హీరోయిజం వున్న సినిమాల‌కు ప‌నిచేయాల‌నుకున్నా. ఆయ‌న టేకింగ్ చాలా బాగుంటుంది. నువ్వొస్తానంటే నే నొద్దంటానా.. యూత్‌కు బాగా న‌చ్చింది. అప్పుడు ఆ సినిమాకు బాగా క‌నెక్ట్ అయ్యా. అంత పెద్ద నిర్మాత ద‌ర్శ‌కుడు న‌న్ను ఎంపిక చేయ‌డం ఆనందంగా వుంది.
 
* డ‌ర్టీ హ‌రీ క‌థ చెప్పిన‌ప్పుడు ఎలా అనిపించింది? 
ఇప్ప‌టి యూత్ ఆలోచ‌న‌లకు అనుగుణంగా వుంది. మ‌నిషిలో ప‌శువు కూడా దాగి వుంటాయి. అది కొన్ని సంద‌ర్బాల‌లో బ‌య‌ట‌ప‌డుతుంది. అలాంటి వ్య‌క్తి ప్రేమిస్తే ఏమ‌వుతుంది? అనేది క‌థ‌. ఇది అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌క‌ముంది.
 
* టీజ‌ర్లో.. బోల్డ్‌నెస్ ఎక్కువ‌గా వుంది.. ఇది రిసీవ్ చేసుకుంటారా? 
బ‌య‌ట జ‌రిగే విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు చూపించారు. క‌థ చెప్పిన‌ప్పుడు ఇలా వుంటుంద‌ని తెలుసు. ఈ సినిమా యూత్‌తోపాటు 40 ఏళ్ల‌లోపు వారికీ బాగా న‌చ్చుతుంది. ఆపై వున్న వారు కూడా కొంద‌రు క‌నెక్ట్ అవుతారు. బోల్డ్‌నెస్ అంటారో.. శృంగారం అంటారో.. అది అంద‌రికీ తెలిసిందే. సినిమాప‌రంగా లిమిట్‌గా వుంటాయి. ఎక్క‌డా గాడి త‌ప్ప‌లేదు. టీజ‌ర్‌లో చూసింది కొంత మేరకే. అస‌లు క‌థ చాలా వుంది.
 
* లిప్‌కిస్‌లు, బెడ్‌రూమ్ సీన్‌ల‌కు ఎన్ని టేక్‌లు చేశారు? 
అవ‌న్నీ క‌థ‌లో భాగ‌మే.. ముందుగా రాసుకున్న క‌థ ప్ర‌కారం.. సింగిల్ షెడ్యూల్‌లో టేక్‌లో చేశాం. అటువైపు హీరోయిన్ కూడా స‌హ‌క‌రించ‌డంతో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. ఇలాంటి సీన్‌కోసం ఎక్కువ టేక్‌లు తీసుకుంటే క‌థ‌నం చెడిపోతుంది. అందుకే ప‌రిమితంగానే చేశాం. 
 
* ఈ సినిమా త‌ర్వాత ఇండ‌స్ర్టీలో ఎలాంటి ఫీడ్ బేక్ వ‌చ్చింది మీకు? 
నేను ఈ సినిమాను చేశాక‌.. ఏప్రిల్‌లో మ‌రో సినిమాలో చేయాలి. అది పెద్ద కంపెనీ సినిమా. కానీ క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో ప్ర‌ముఖ కంపెనీకి చెందిన వెబ్ సిరీస్ చేశాను. అభీన‌హీతో క‌భీ న‌హీ-లో చేశాను. ఇది వ‌ర్కింగ్ టైటిల్‌. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు చెబుతాను.. అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments