Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్ బాబుతో తప్పకుండా సినిమా చేస్తా: ఎం.ఎస్‌. రాజు

మహేష్ బాబుతో తప్పకుండా సినిమా చేస్తా: ఎం.ఎస్‌. రాజు
, శనివారం, 12 డిశెంబరు 2020 (21:10 IST)
ప్ర‌తి వ్య‌క్తిలోనూ మార్పు స‌హ‌జం. ఎత్తుప‌ల్లాలు మామూలే. ఒక‌ప్పుడు సంక్రాంతి రాజుగా మంచి హిట్లు ఇచ్చిన నేను కొంత‌కాలం విరామం తీసుకున్నాను. దాంతో ఇక ఎం.ఎస్‌రాజు ప‌ని అయిపోయింద‌నుకోవ‌డం పొర‌పాటే. మారుతున్న కాలంతోపాటు మారి క‌థ‌ను ఎంపిక‌ చేసుకున్నా. ఇప్పుడు క‌థ‌ప‌రంగా, టేకింగ్‌గా ప‌రంగా వ‌స్తున్న మార్పుకు అనుగ‌ణంగానే డ‌ర్టీ హ‌రీ.. సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాన‌ని.. ఎం.ఎస్‌. రాజు తెలిపారు.
 
దేవి, వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బాస్టర్స్ నిర్మించిన ఎం.ఎస్.రాజు దర్శకునిగా ఒక కొత్త పంథాలో ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఫస్ట్ కాపీ చూసిన 'హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్' సంస్థ అధినేతలు కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఫ్యాన్సీ రేటుతో ఈ సినిమా కొనుగోలు చేసారు. 'ఫ్రైడే మూవీస్' యాప్ ఈ సినిమాతోనే ప్రారంభం కానుంది. ఈ యాప్‌లో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి 7997666666 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది" అని తెలిపారు. ఈ నెల 18న విడుద‌ల‌ కానున్న ఈ సినిమా గురించి ఎం.ఎస్‌.రాజు ఇలా చెబుతున్నారు.
 
చిత్రం గురించి చెప్పండి...
శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లు. ఎస్.పి.జె క్రియేషన్సు పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
స్టోరీ లైన్ ఏంటి?
ముఖ్యంగా స‌స్పెన్సు అంశం చిత్రానికి కీల‌కం. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడు. మనం రోజూ చూసే మనిషి, పైకి కనపడే మనిషి ఒక్కోసారి వేరే రకంగా కనిపిస్తారు. ఆ లోపలి మనిషి ఒక్కోసారి గాడి తప్పి ప్రవర్తించొచ్చు. ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ వల్ల చాలా పరిణామాలు సంభవిస్తాయి. ఇందులో హీరో పాత్రకు ఇద్దరమ్మాయిలతో ఏర్పడిన అనుబంధం అనేక పరిణామాలకు దారి తీస్తుంది.
 
గ్యాప్ వచ్చింది కదా... ఇండస్ట్రీలో రూమర్స్ పైన ఏమంటారు?
ఒక‌ప్పుడు పెద్ద పెద్ద‌వారికే విరామం త‌ప్ప‌లేదు. ఎన్‌.టి.ఆర్‌., చిరంజీవిలాంటివారికే త‌ప్పింది కాదు.  రాజ్‌క‌పూర్ కూడా గొప్ప సినిమా తీశాడు. ఆ త‌ర్వాత గ్యాప్ వ‌చ్చింది. ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు. అప్ప‌ట్లోనే బాబీ.. అనే సినిమా తీశాడు. అప్ప‌టికి అది పెద్ద దుమారం లేపింది. అలాంటిది ఇప్పుడు మారిన ప‌రిస్థితుల‌వ‌ల్ల నేను తీసిన డ‌ర్టీ హ‌రీ.. న‌థింగ్‌.. ఇది అంద‌రికీ న‌చ్చుతుంది. హాయిగా ఫ్యామిలీ ఆడియ‌న్సు ఈ సినిమా చూడొచ్చు.
webdunia
నేను ఆ మ‌ధ్య‌.. డ‌ర్టీ పిక్చ‌ర్‌.. చూశా.. పెద్ద‌గా జ‌నాలు లేర‌నుకున్నా.. కానీ థియేటర్లో ఎక్కువ‌గా మ‌హిళ‌లే వున్నారు. అప్ప‌డే అనిపించింది. అందుకే నేను తీసిన డ‌ర్టీ హ‌రి కూడా మెప్పిస్తుంది. నేను మారుతున్న కాలంతోపాటు మారాను. మారాలి. అందుకే ఈ సినిమా తీశాను. ఇందులో ట్రైల‌ర్‌లో చూపించింది. కేవ‌లం ప‌బ్లిసిటీకోసం కాదు. క‌థ‌లో కొద్దిగానే.. కానీ అస‌లు క‌థ చాలా వుంది. అది చూస్తే.. ఎం.ఎస్‌.రాజుగారు మంచి సినిమా తీశార‌ని మెచ్చుకుంటారు.
 
డర్టీ హరి ఎందుకు తీసారు?
పాండ‌వులు క‌థ చ‌దివినా.. ఒక‌ప్పుడు పాండ‌వులు అన‌రు. ఎప్పటికీ పాండ‌వులే అంటారు. అలాగే.. నేను ఒక‌ప్పుడు బాగా తీశాను. ఇప్పుడు తీయ‌లేన‌ని అన‌కండి.. నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా సినిమా తీస్తాను. దాదాపు అన్ని క‌థ‌లు తీశాను. కానీ డ‌ర్టీ హ‌రి.. లాంటి క‌థ ఇప్పుడు తీయాల‌నిపించింది తీశాను.
 
ఆ సినిమా దెబ్బతో బాగా నష్టపోయారనీ...
ఏ రంగంలోనైనా ఎత్తుప‌ల్లాలు మామూలే. రాజ్‌క‌పూర్‌, ఎన్‌టిఆర్‌. చిరంజీవి.. ఎవ‌రైనా కొంత‌కాలం విరామం తీసుకుని త‌ర్వాత పుంజుకున్న‌వారే. నేను విజ‌యాలు చ‌విచూశాక‌.. స్ట్రీట్ ఫైట‌ర్‌ సినిమా తీసి న‌ష్ట‌పోయాను. అది చాలా కాలం వెంటాడింది. ఆల్‌మోస్ట్ రోడ్డుమీద‌కు వ‌చ్చేశా. అలాంటి స‌మ‌యంలో ఇల్లును కూడా అమ్ముకున్నా. ఆ ద‌శ‌లో మ‌ళ్ళీ ఏదో ఒక‌టి చేయాల‌ని దేవి క‌థ‌తో ముందుకు వ‌చ్చా. అప్పుడు చిరంజీవిగారు ఎంతో స‌హ‌క‌రించారు. ఇద్ద‌రం మార్పు కోసం ఎదురుచూస్తున్నాం. ఆ త‌ర్వాత ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు చేశాను. త‌ర్వాత విరామం తీసుకుని ఇప్పుడు అన్ని వ‌ర్గాల‌వారు చూడ‌త‌గ్గ సినిమాను చేశాను.
 
డర్టీ హరి కథకు స్పూర్తి..?
డ‌ర్టీ హ‌రి.. క‌థ‌కు  స్పూర్తి... మ‌న చుట్టూ వున్న వ్య‌క్తుల‌ను ప‌రిశీలించే రాసుకున్న క‌థ‌. ఒక సామాన్యుడు క‌థ‌. రోజూ ఎంతో కొంత ఎద‌గాల‌నుకునే వ్య‌క్తి క‌థ‌. ఆ ద‌శ‌లో అత‌ను ఏం చేశాడు? ఏ మార్గంలో వెళ్ళాడ‌నేది పాయింట్‌.
 
దర్శకుడుగా ఇంట్రెస్ట్ ఎందుకు?
నేను 1990లో జన‌వ‌రి 21లో సుమంత్ ఆర్ట్సు ప్రొడ‌క్ష‌న్‌లో శ‌త్రుతో ఈ రంగంలోకి ప్ర‌వేశించాను. చాలా కాలం సినిమా మంచివి తీశాను. దేవి సినిమా త‌ర్వాత మూడేళ్ళు గ‌ట్టెక్కించింది. ఆ త‌ర్వాత కొంత న‌ష్ట‌పోయినా.. మ‌న‌సంతా నువ్వే.. క‌వ‌ర్ చేసింది. మ‌స్కా వ‌ర‌కు సినిమా చేశాను. నా సినిమాల‌కు ద‌ర్శ‌కుడు ఎవ‌రున్నా ఎం.ఎస్‌. రాజు సినిమానే అనేవారు. త‌ర్వాత -ఆట‌, మ‌స్కా- సినిమాలు ఆడాయి. తూనీగా తూనీగా ప్లాప్ అయింది. ఆ స‌మ‌యంలో సినిమా నిర్మాత‌గా చేయాలా... ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలా అనే డైల‌మాలో వున్నా. అలా స‌మ‌యం గ‌డిచిపోయింది. మూడేళ్ళ‌లో ప‌రిశీలించి.. ఒక ఐడియా వ‌చ్చింది. అదే డ‌ర్టీ హ‌రీ.
 
మహేష్ బాబుతో సినిమా చేస్తారా?
పెద్ద పెద్ద సినిమాలు చేసి ఇప్పుడు చిన్న సినిమా ఎందుకు చేస్తున్నార‌నే అనుమానం అంద‌రికీ వ‌స్తుంది. ఇది చ‌క్క‌టి క‌థ‌. యువ‌తతో పాటు పెద్ద‌ల‌నూ ఆక‌ట్టుకుంటుంది. నా ట్రైల‌ర్‌.. జునైద్‌... క‌ట్ చేశాడు. త‌ను ఓ బేబీకి ప‌నిచేశాడు. ఇందులో క‌నిపించేది అంగుళ‌మే.. అస‌లు క‌థంతా చాలా వుంది. అది తెర‌పై ఊడాల్సిందే.
 
భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని సినిమాలు తీయ‌డానికి సిద్ధంగా వున్నా. క‌థ‌లు కూడా వున్నాయి. మ‌హేష్‌ బాబుతో ఒక్క‌డు చేశాను.. మ‌ర‌లా ఆయ‌న‌తో చేసే అవ‌కాశం త‌ప్ప‌కుండా వుంటుంది అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవంతంగా షూటింగ్ పూర్తిచేసుకున్న 'కోతి కొమ్మచ్చి'