Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శృంగారానికి బూతుకు తేడా వుంది: ఎం.ఎస్‌.రాజు

శృంగారానికి బూతుకు తేడా వుంది: ఎం.ఎస్‌.రాజు
, బుధవారం, 9 డిశెంబరు 2020 (17:31 IST)
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డర్టీ హరి'. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లు. ఎస్.పి.జె క్రియేషన్సు పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 18 న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.
 
ఈ సినిమా టీజ‌ర్‌ను బుధ‌వారంనాడు విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే పోస్ట‌ర్ల‌తో హోరెత్తించిన ఈ సినిమా టీజ‌ర్ అంత‌కుమించి వుంది. పూర్తి శృంగారంతో నిండి వున్న ఈ చిత్రం గురించి ఎం.ఎస్‌. ఏమంటున్నారంటే.... ఈ చిత్రం టీజ‌ర్ చూశాక‌.. చాలామందికి ఇలాంటి సినిమా ఎందుకు చేశార‌నే ఆలోచ‌న వ‌స్తుంది. దానికి సినిమానే స‌మాధానం చెబుతుంది. బూతు సినిమా తీయ‌లేదు. బూతుకు శృంగారికి చాలా తేడా వుంది. ఇది శృంగారానికి సంబంధించిన సినిమా.
 
ఒక మనిషి అనుకోని స్థితిలో విప‌రీత‌ ధోర‌ణిలోకి మారాడంటే అందుకు కార‌ణం ఏమిటి? అనేది ఇందులో అంశం. ముఖ్యంగా స‌స్పెన్సు అంశం చిత్రానికి కీల‌కం. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడు. మనం రోజూ చూసే మనిషి, పైకి కనపడే మనిషి ఒక్కోసారి వేరే రకంగా కనిపిస్తారు. ఆ లోపలి మనిషి ఒక్కోసారి గాడి తప్పి ప్రవర్తించొచ్చు. ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ వల్ల చాలా పరిణామాలు సంభవిస్తాయి.
 
ఇందులో హీరో పాత్రకు ఇద్దరమ్మాయిలతో ఏర్పడిన అనుబంధం అనేక పరిణామాలకు దారి తీస్తుంది.. అనేది ఆస‌క్తిక‌రం. దేవి, వర్షం, ఒక్కడు , మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బాస్టర్స్ నిర్మించిన ఎం.ఎస్.రాజు దర్శకునిగా ఒక కొత్త పంధాలో ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఫస్ట్ కాపీ చూసిన 'హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్' సంస్థ అధినేతలు కేదార్ సెలగం శెట్టి, వంశీ  కారుమంచి  ఫ్యాన్సీ రేటుతో ఈ సినిమా కొనుగోలు చేసారు. 'ఫ్రైడే మూవీస్' యాప్  ఈ సినిమాతోనే ప్రారంభం కానుంది. ఈ యాప్‌లో కొంతమంది ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి  7997666666 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది" అని తెలిపారు.
 
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: మార్క్.కే.రాబిన్, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్, డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి, ఎడిటర్: జునైద్ సిద్ధిఖి, సమర్పణ: గూడూరు శివరామకృష్ణ, నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి, రచన - దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో సుమంత్ విడుదల చేసిన సముద్ర `జైసేన` లిరిక‌ల్ వీడియో సాంగ్‌