Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డర్టీ హరి పేరుతో ఎం ఎస్ రాజు సినిమా.. బోల్డ్ సినిమానే క్లాసిక్‌గా వుంటుంది..

డర్టీ హరి పేరుతో ఎం ఎస్ రాజు సినిమా..  బోల్డ్ సినిమానే క్లాసిక్‌గా వుంటుంది..
, ఆదివారం, 5 జనవరి 2020 (13:00 IST)
శత్రువు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం ఎస్ రాజు చాలా  కాలం తర్వాత ఓ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. డర్టీ హరి పేరుతో చాలా బోల్డ్‌గా ఈ మూవీ రానుంది. 
 
బాలచందర్, పుట్టన్న కనగల్ వంటి దర్శకులు అప్పట్లో చాలా బోల్డ్‌గా సినిమాలు తీసినా… బ్యూటిఫుల్‌గా, క్లాసికల్‌ ఉండేవి. వాటి స్పూర్తితోనే ఎం ఎస్ రాజు ఈ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఎస్.పి.జి క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయం అవుతుండగా, రుహిని శర్మ, సిమత్ర కౌర్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎం ఎస్ రాజు చిత్రం కావటంతో… సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళ్యాణ్ రామ్ ఫంక్షన్‌కి సర్‌ఫ్రైజ్ గెస్ట్..?