కళ్యాణ్ రామ్ ఫంక్షన్‌కి సర్‌ఫ్రైజ్ గెస్ట్..?

శనివారం, 4 జనవరి 2020 (21:08 IST)
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ఎంత మంచివాడవురా. ఈ చిత్రాన్ని శతమానంభవతి ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కించారు. ఆదిత్య మూవీస్ ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఈ సినిమాని నిర్మించింది. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ కానుంది. 
 
అయితే... ఈ సంక్రాంతికి మహేష్ సరలేరు నీకెవ్వరు, బన్నీ అల.. వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఈ రెండు పెద్ద సినిమాలతో పోటీపడి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుండడం ఆసక్తిగా మారింది.
 
అయితే... ప్రమోషన్స్‌లో మహేష్, బన్నీ దూసుకెళుతున్నారు. దీంతో కళ్యాణ్ రామ్ కూడా కాస్త స్పీడు పెంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. ఈ నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ వేడుకకు సర్ఫ్రైజ్ గెస్ట్ వస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ.. సర్ప్రైజ్ గెస్ట్ ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరో కాదు నందమూరి నట సింహం బాలకృష్ణ. అంతేకాదండోయ్ బాలయ్యతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ వేడుకు వస్తున్నాడట.
 
 సో.. నందమూరి త్రయం బాలయ్య, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఈ ముగ్గురు నందమూరి హీరోలు ఒకే వేదిక పైకి రానుండడంతో నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఈ ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే కనుక జరిగితే నందమూరి అభిమానులకు పండగే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం టెన్షన్‌లో మహేష్ బాబు ఫ్యాన్స్, ఏమైంది..?