Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఒరేయ్ బుజ్జిగా" అంటున్న ఆ ఇద్దరు హీరోయిన్లు (ట్రైలర్)

Advertiesment
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (18:06 IST)
టాలీవుడ్ యూత్ స్టార్ రాజ్ తరుణ్, మాళవికా నాయర్, హెబ్బా పటేల్ నటిస్తున్న తాజా చిత్రం ఒరేయ్ బుజ్జిగా. ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఆహా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. కుటుంబ విలువలతో ముడిపడిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొంద‌గా, తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. అక్కినేని నాగ చైత‌న్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఒరేయ్ బుజ్జిగా చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. 
 
ఈ ట్రైలర్ చూస్తుంటే మ‌న‌ల్ని నవ్విస్తూనే మనసుల్ని కదిలించే భావోద్వేగాలుంటాయని తెలుస్తుంది. రాజ్‌తరుణ్‌, మాళవికా నాయర్‌ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసానికృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్‌ రూబెన్స్ అందించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూరగాయలు అమ్ముతున్న "బాలికా వధు" అసిస్టెంట్ డైరెక్టర్!!!