తెలంగాణలోని 'ఓదెల' అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'. సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతోన్నఈ చిత్రంలో 'రాధ' అనే పల్లెటూరి అమ్మాయిగా ఇంతకు ముందెన్నడూ కనిపించని ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెబ్బా పటేల్ నటిస్తోంది. దీపావళి కానుకగా హెబ్బా పటేల్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆమె లుక్ అభిమానులని ఆకట్టుకుంటుంది.
శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. కన్నడలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న వశిష్ట సింహ తెలుగులో హీరోగా నటిస్తోన్నమొదటి చిత్రమిది.
హిట్ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో సున్నితమైన మనసు, దృడమైన వ్యక్తిత్వం గల పల్లెటూరి అమ్మాయి 'రాధ' పాత్రలో హెబ్బా పటేల్ నటిస్తోంది. దీపావళి కానుకగా ఆమె లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా బేనర్‌లో మొదటిసారిగా ఈ మూవీ ఫుల్ రియలెస్టిక్ అప్రోచ్‌తో ఉండబోతుంది. పూర్తి న్యాచురాలిటీతో దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.
ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల మండల పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌తో పాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరిపాం. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం' అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ, 'హెబ్బా పటేల్ గత చిత్రాలకు భిన్నంగా ఒక వైవిద్యమైన పల్లెటూరి అమ్మాయి రాధ పాత్రలో తప్పకుండా ఆకట్టుకుంటుంది' అన్నారు. వశిష్టసింహ, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ, నాగమహేష్ (రంగస్థలం ఫేమ్), భూపాల్, శ్రీగగన్, దివ్య సైరస్, సురేందర్ రెడ్డి, ప్రియా హెగ్డే తదితరులు నటిస్తోన్నఈ చిత్రానికి..
సినిమాటోగ్రఫి: ఎస్. సౌందర్ రాజన్,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
ఫైట్స్: రియల్ సతీష్,
సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్,
నిర్మాత: కె.కె.రాధామోహన్,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే: సంపత్‌నంది,
దర్శకత్వం: అశోక్ తేజ.