Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి బ్రేకప్ చెప్పిన ఇలియానా... ఫోటోలు డిలీట్

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (20:24 IST)
గోవా బ్యూటీ, నాజూకు నడుం చిన్నదిగా గుర్తింపు పొందిన ఇలియానా తన ప్రియుడుతో బ్రేకప్ చెప్పింది. దీనికి నిదర్శనమే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. దీంతో ఆమె ప్రియుడితో విడిపోయారని తేటతెల్లమైంది.
 
నిజానికి ఇలియానా లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు పలుమార్లు వైరల్‌ అయ్యాయి. ఇద్దరూ సోషల్‌మీడియా ఖాతాల్లో అన్యోన్యంగా దిగిన ఫొటోలను కూడా షేర్‌ చేశారు. 'ఈ ఫొటో తీసింది మావారే' అంటూ క్రిస్మస్‌ ట్రీని అలంకరిస్తున్న ఫొటోను ఇలియానా గతంలో పోస్ట్‌ చేశారు. 
 
ఆండ్రూ కూడా పలు సందర్భాల్లో ఇలియానా అందాన్ని మెచ్చుకుంటూ ఫొటోలు షేర్‌ చేశారు కూడా. దీంతో ఇలియానా అతడిని వివాహం చేసుకున్నారని వదంతులు వచ్చాయి. దీని గురించి నటిని ప్రశ్నించగా.. 'ఈ విషయంపై కామెంట్‌ చేయడం నాకు ఇష్టం లేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేమిద్దరం చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాం. ధన్యవాదాలు.. నా వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగానే ఉంచాలి అనుకుంటున్నా' అని అన్నారు. 
 
ఇలియానా కోసం ఆండ్రూ పలుమార్లు ముంబైకి కూడా వచ్చారు. కాగా ఇప్పుడు వీరిద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది. ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్నేళ్లపాటు సంతోషంగా ఉన్న వీరు విడిపోవడానికి కారణం ఏంటని కథనాలు రాస్తున్నారు. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే ఇలియానా స్పందించాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments