Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్మీకి ఎంతవ‌ర‌కు వ‌చ్చాడు..?

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (18:49 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. తమిళ్‌లో ఇటీవల రిలీజ్ అయి, మంచి సక్సెస్ సాధించిన జిగార్తాండ మూవీకి అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. 
 
ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి మాస్ కమర్షియల్ పంథాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఒక డిఫరెంట్ రోల్‌లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అలానే జర్ర జర్ర లిరికల్ మరియు వీడియో ప్రోమో సాంగ్‌కు వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో, వాల్మీకి టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 
 
ఇక ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతుండగా, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను, దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది. 
 
 
 
తమిళ నటుడు అధర్వ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు అయనాంక బోస్ కెమెరా మ్యాన్‌గా పనిచేస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను, వచ్చేనెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments