Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్ అలాంటి పాత్రలో...

Webdunia
బుధవారం, 26 మే 2021 (17:12 IST)
మన్మథుడు 2 చిత్రంలో ఓ టైపు పాత్రలో నటించిన  రకుల్ ప్రీత్ సింగ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అక్కడ ఛాన్సులు రావాలంటే ఎలాంటి పాత్రలు చేయాలో వేరే చెప్పక్కర్లేదు.
 
బోల్డ్ పాత్రలు చేసేందుకు బాలీవుడ్ భామలు ఎంతమాత్రం వెనకాడరు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన పరిధిని కాస్త విస్తరించి మరింత బోల్డ్ రోల్ చేసేందుకు అంగీకరించిందట. రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రను పోషించేందుకు సై అన్నట్లు బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం ఆర్ఎస్విపి పతాకంపై నిర్మించబడుతుందని సమాచారం.
 
ఈ చిత్రం కోసం ఆమెను సంప్రదించినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కొద్దిసేపు ఆశ్చర్యపోయినప్పటికీ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర చేసేందుకు సై అందట. పైగా సమాజంలో వున్నటువంటి పరిస్థితులు, యువతులు ఎదుర్కొనే సమస్యల విషయంలో కొన్నిసార్లు ఇలాంటి సున్నితమైన పాత్రలు చేయాల్సిందే అని కూడా చెప్పిందట. కాగా ఈ చిత్రం లఘుచిత్రమనీ, షూట్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదని అంటున్నారు. దేశంలో మహమ్మారి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
 
కండోమ్ టెస్టర్ ఏం చేస్తారు?
 
కండోమ్ పరీక్షకులు సెక్స్-ఎగ్జిక్యూటివ్స్ అన్నమాట. వారు పెద్ద కంపెనీలచే తమ కండోమ్‌లు మార్కెట్లోకి రాకముందే పరీక్షించడానికి నియమించుకుంటారు. పాత్ర కోసం సైన్ అప్ చేసే టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్స్ కొంతకాలం శృంగారంలో పాల్గొనడానికి కేటాయించబడతారు. ఆ తరువాత కండోమ్ పట్ల వారి అనుభవం గురించి ప్రశ్నలు అడుగుతారు. కండోమ్ శబ్దం చేసిందా, సౌకర్యంగా ఉందా, బాధాకరంగా ఉందా, ఆహ్లాదకరంగా ఉందా... ఇలా తదితర ప్రశ్నలు ఎన్నో వుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

Very Heavy Rains: తెలంగాణలో అతి భారీ వర్షాలు- ఆరెంజ్ అలర్ట్ జారీ

Cloudburst: జమ్మూ కాశ్మీర్‌ జల విషాధం: 45 మంది మృతి, 120 మందికి గాయాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం