టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్రక్కు డ్రైవరు అవతారమెత్తింది. ఈమె డ్రైవింగ్ స్కిల్స్ సూచి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో హీరో అర్జున్ కపూర్ నటిస్తున్న "సర్దార్ కా గ్రాండ్‌సన్" అనే చిత్రంలో నటిస్తోంది.
ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన రకుల్ ఈ చిత్రం కోసం డ్రైవరుగా మారిందన్న వార్త బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ సినిమాలో ట్రక్కు డ్రైవర్‌గా కనిపించబోతుందట. ఇందుకోసం ఆమె ట్రక్ డ్రైవింగ్‌ను నేర్చుకోవడం గమనార్హం.
ఇదే అంశంపై రకుల్ స్పందిస్తూ, నాకు వ్యక్తిగతంగా డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం. అయితే, ఈ చిత్రంలో ట్రక్కు డ్రైవరుగా కనిపిస్తాను. షూటింగ్ మొత్తం చాలా ఫన్‌గా సాగింది. ట్రక్కు డ్రైవింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ నేను చాలా సులభంగా కాన్ఫిడెంట్ గా ట్రక్కును డ్రైవ్ చేశా.
ట్రక్కును ఎలా డ్రైవ్ చేయాలో చెప్పేందుకు సెట్స్‌లో ఓ ట్రక్కు డ్రైవర్ ఉండేవాడు. ట్రక్కును ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పేవాడు. నా డ్రైవింగ్ స్కిల్స్ చూసి సెట్స్‌లో ఉన్నవారు షాక్ అయ్యారు. జీవితంలో ఇలాంటి అనుభూతి ఒక్కసారి మాత్రమే వస్తుందని రకుల్ చెప్పుకొచ్చింది.