కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తోంది. సామాన్య ప్రజల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకూ ఎవర్నీ వదలడంలేదు. కరోనా కారణంగా ఇప్పటికే చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. మరికొందరు కరోనా సోకి చికిత్స తీసుకుంటున్నారు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు కరోనా వైరస్ సోకింది. దీనితో ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. కానీ గురువారం నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి కన్నుమూశారు. దీనితో రామ్ చరణ్ ముందుజాగ్రత్త చర్యగా హోం ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకుంటారని తెలుస్తోంది.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఇంకా ప్రిన్స్ మహేష్ బాబు స్టైలిస్టుకు కరోనా సోకడంతో ఆయన కూడా హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్లు చెపుతున్నారు.