Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రీ రోజెస్ వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో పాయల్ రాజ్‌పుత్

Advertiesment
త్రీ రోజెస్ వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో పాయల్ రాజ్‌పుత్
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:21 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు "ఆర్ఎక్స్ 100" చిత్రం ద్వారా పరిచయం కావడమే కాదు... ఈ ఒక్క చిత్రంతోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ఆమె భారీ అందాలను పూర్తిగా ప్రదర్శించింది. ఈ సొగసరి మంచి పొడగరి .. అది ఆమెకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. పైగా తొలి చిత్రంలోనే నెగెటివ్ రోల్‌లో కనిపించి ప్రతి ఒకరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
 
అదేసమయంలో మోడరన్ దుస్తుల్లో అయినా, చీరకట్టులో అయినా ఈ సుందరి కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. కావలసిన అందాలు .. కాస్త అటూ ఇటుగా అనిపించే అభినయంతో తన కెరియర్‌ను కొనసాగిస్తోంది. అయితే ఇండస్ట్రీలో రాణించాలంటే లక్కూ, లౌక్యం రెండూ కావాలి. లేదంటే కాస్త వెనకబడక తప్పదు. ఈ పిల్ల విషయంలో అదే జరిగింది.
 
తెలుగులో పాయల్ ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోలేక పోయింది. ఇదే ఇప్పుడు ఆమె అభిమానులను బాధపెడుతోంది. 
 
దీంతో ఆమె తన రూట్‌ను మార్చుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' వారు 'త్రీ రోజెస్' అనే వెబ్‌సిరీ‌స్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో చేస్తోందట. ఆమె విలనిజమే ఈ సిరీస్‌కి హైలైట్‌గా నిలుస్తుందని  అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్‌లైన్‌లో ఆశీర్వదించగలరు...