Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో పవర్‌ఫుల్ విలన్.. ఎవరతను?

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:41 IST)
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాల్లో నటించేందుకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న "ఆచార్య" షూటింగ్ త్వరలోనే ముగియనుండగా, వేసవిలో చిత్రం విడుదలకానుంది. ఇందులో చిరంజీవి తనయుడు చెర్రీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో "లూసిఫర్" రీమేక్‌లో చిరు చేయనున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ మూవీ తర్వాత చేయబోయే రెండు చిత్రాలను కూడా చిరు ప్రకటించారు. అందులో ఒకటి మెహర్ రమేష్‌తో "వేదాళమ్" రీమేక్ కాగా, మరొకటి "పవర్" దర్శకుడు బాబీతో ఉండనుందని రీసెంట్‌గా మెగాస్టారే.. "ఉప్పెన" ఫంక్షన్‌లో రివీల్ చేశారు. 
 
బాబీ దర్శకత్వంలో తెరకెక్కే మూవీ ఫ్రెష్ స్టోరీ అని.. అన్ని అంశాలు మేళవించి ఉంటాయని ఆ చిత్రాన్ని నిర్మించబోయే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో స్వయంగా మెగాస్టారే.. పరిపూర్ణ నటుడిగా అభివర్ణించిన మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా చేయనున్నారనే వార్తలు వినవస్తున్నాయి. 
 
చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం "సైరా"లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు "ఉప్పెన" చిత్రంలో విలన్‌గా అరిపించేశాడు అనేలా టాక్ నడుస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో కూడా విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, వైవిధ్యంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో, ఆ పాత్రకి విజయ్ సేతుపతి అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని చిరు భావిస్తున్నారు. 
 
అందుకే విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటింపజేయాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలెట్టారని తెలుస్తోంది. చిరు సినిమా కాబట్టి.. విజయ్ సేతుపతి ఎంత బిజీగా ఉన్నా.. ఏదో విధంగా డేట్స్ అడ్జస్ట్ చేస్తుకుంటాడని, అతనే చిరు-బాబీ సినిమాలో విలన్ అని టాక్ నడుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments