Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాల‌య్య‌, చిరంజీవి, ప‌వ‌న్‌, ఎన్‌.టి.ఆర్‌. సినిమాల‌పై నిర్మాత‌లు వివ‌ర‌ణ‌

Advertiesment
బాల‌య్య‌, చిరంజీవి, ప‌వ‌న్‌, ఎన్‌.టి.ఆర్‌. సినిమాల‌పై నిర్మాత‌లు వివ‌ర‌ణ‌
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (12:35 IST)
Mytri movies producers, ravi, naveen
అగ్ర‌హీరోల‌తో సినిమా చేయ‌డ‌మంటే ముందు వెనుక అవుతాయి. ఒక హీరోతో అనుకుంది వేరే హీరోతో మొద‌లు పెట్టిన సంద‌ర్భాలు చాలానే వున్నాయి. ఇప్పుడు మైత్రీ మూవీస్ సంస్థ తెలుగులో అగ్ర‌హీరోల‌తో సినిమాలు చేస్తుంది. ప‌నిలోప‌నిగా వారి కుటుంబీకుల సినిమాలు కూడా మ‌రోవైపు చేస్తూనే వున్నారు.

ముందు కుటుంబీల హీరోతో మొద‌లు పెట్టి ఆ త‌ర్వాత అగ్ర‌హీరోల డేట్స్ తీసుకుంటుంటారు. తాజాగా ఉప్పెన నిర్మాత‌లు నవీన్, రవిలు ఎన్‌.టి.ఆర్‌., ప‌వ‌న్‌తో సినిమాలు చేయాలి. కాని అవెందుకే వాయిదా ప‌డ‌డంతో అస‌లు వుండ‌వేమో అని అభిమానులు సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెడుతుంటే వారికి మైత్రీ మూవీస్ నిర్మాత‌లు ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
 
కెజి.ఎఫ్‌. ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ ఎప్పుడైతే ప్రభాస్ తో సినిమా స్టార్ట్ చేశాడో, ఆ వెంటనే అతడు ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాపై కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్‌.తో ఎన్‌.టి.ఆర్‌. బిజీ వుండ‌డంతోపాటు త్రివిక్ర‌మ్ సినిమాకూ ఆయ‌న చేయాలి. ఇలా ఏదో ఒక వార్త వ‌స్తూనే వుంది. అందుకే మొత్తంగా ఈరోజు మైత్రీమూవీస్ నిర్మాత‌లు అంతా క్లారిటీ ఇచ్చారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పారు. అందుకు స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. అదేవిధంగా  పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ క‌ల‌యిక‌లోకూడా సినిమా వుంది. అది చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో అనుకోకుండా దిల్ రాజు `వకీల్ సాబ్` మొదలైంది. ఆ తర్వాత మాది అనుకున్నాం. అంతలోనే ఏఎం రత్నం సినిమా కథ రెడీ అయింది. దాంతో పవన్ ఆ సినిమా స్టార్ట్ చేశారు.

ఏది ఏమైనా జూన్‌లో మొద‌లు పెడ‌తాం అన్నారు. వీరేకాకుండా బాల‌కృష్ణ‌, చిరంజీవితోకూడా సినిమాల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. బోయ‌పాటి శ్రీ‌నుతో సినిమా పూర్తి కాగానే బాల‌కృష్ణ‌, మ‌లినేని గోపీచంద్ సినిమా మొద‌లు పెడ‌తాం అన్నారు. ఇక బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి సినిమా గురించి మీకు తెలిసిందే. చిరుగానే ప్ర‌క‌టించారు గ‌దా అని వివ‌రించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైష్ణ‌వ్ తేజ్‌కు స‌వాల్ ‌లాంటి పాత్ర: ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్‌