Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైష్ణ‌వ్ తేజ్‌కు స‌వాల్ ‌లాంటి పాత్ర: ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్‌

Advertiesment
వైష్ణ‌వ్ తేజ్‌కు స‌వాల్ ‌లాంటి పాత్ర: ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్‌
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:59 IST)
Pavan kalyan, vaishnav tej
మన జీవితాల్ని... అందులోని భావోద్వేగాల్ని... మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు. ఆ కోవలోకి ‘ఉప్పెన’ చిత్రం చేరుతుంది అని ప్రముఖ కథానాయకులు, జనసేన అధ్యక్షులు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్  చెప్పారు.

మన మట్టి పరిమళాన్ని అందించే ఇలాంటి చిత్రాలు ప్రతి ఒకరికీ నచ్చుతాయి అన్నారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంస్థలు  నిర్మించాయి. రేపు విడుద‌ల‌కానున్న ఈ సినిమా గురించి నేడు ప‌వ‌న్ స్పందించారు. పవన్ కల్యాణ్‌కి ఈ చిత్రం ట్రైలర్‌ను, ప్రమోషనల్ కంటెంట్‌ను చిత్ర కథానాయకుడు వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ చూపించారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. 
 
పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ, “వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి చిత్రంలోనే చాలా మంచి పాత్రను ఎంచుకున్నాడు. మొదటి అడుగులోనే సవాల్‌తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ తేజ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. వైష్ణవ్ ‘జానీ’ చిత్రంలో బాల నటుడిగా... హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. ‘ఉప్పెన’లో వైష్ణవ్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాడు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారు అని అర్థం అవుతోంది.

మనకు పరిచయం ఉన్న జీవితాలను... అందులోని ఎమోషన్స్‌ను... మన నేటివిటీనీ కళ్ల ముందుకు తీసుకువచ్చే చిత్రాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. వీటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ‘రంగస్థలం’, ‘దంగల్’ ‘లాంటి చిత్రాల్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువ కాలం మనకు గుర్తుండిపోతాయి. ‘ఉప్పెన’ కథలోని ఎమోషన్స్ కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చి బాబుకీ, ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటులకు నా అభినందనలు. ‘ఉప్పెన‘ ఘన విజయం సాధించాల”ని ఆకాంక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ "కిన్నెర‌సాని" మోష‌న్ పోస్ట‌ర్