Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌వ‌న్ టైటిల్ క‌న్‌ఫామ్ కాలేదుకానీ, చార్మినార్ సెట్ రెడీ

Advertiesment
ప‌వ‌న్ టైటిల్ క‌న్‌ఫామ్ కాలేదుకానీ, చార్మినార్ సెట్ రెడీ
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (22:48 IST)
Pavan kalyna, krish cinema
సినిమా క‌థ‌కు ఒరిజినాలిటీకోసం సెట్లు వేయ‌డం కామ‌నే. అప్ప‌ట్లో మ‌హేష్‌బాబు సినిమా కోసం ఎం.ఎస్‌.రాజు ఏకంగా చార్మినార్ సెట్ వేసి సినిమా తీశారు. ఇప్పుడు అదేవిధంగా ఎ.ఎం. ర‌త్నం కూడా  అటువంటి ప‌నే చేస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా, క్రిష్ ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి క‌థ‌రీత్యా చార్మినార్ సెట్ వుండాల‌ట‌. అందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు నిర్మాత ఏ.ఎం.రత్నం. 17వ శతాబ్దంలోని కథ కావడంతో ఆ కాలాన్ని గుర్తుచేసేలా స్పెషల్ సెట్స్ వేస్తున్నారు.  చారిత్ర‌క నేప‌థ్యం క‌నుక అటువంటి అవ‌స‌రం అని నిర్ణ‌యానికి వ‌చ్చారు. 
 
ఈ సెట్ ఏర్పాట్లు హైద‌రాబాద్ శివార్లో జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇంత‌కుముందు క్రిష్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి పిరియాడికల్ డ్రామాను తెరకెక్కించారు.
 
ఇక ఈ సినిమాను కూడ అదే స్థాయిలో పూర్తి ఖచ్చితత్వంతో తెరకెక్కిస్తారని అనుకోవచ్చు. ఇదిలా వుంటే, సినిమా టైటిల్ పేరుతో రకరకాల పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. సరైన టైమ్ చూసి తామే స్వయంగా రివీల్ చేస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారంతా ఏడుస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది: కృతి శెట్టి