Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారంతా ఏడుస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది: కృతి శెట్టి

Advertiesment
వారంతా ఏడుస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది: కృతి శెట్టి
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (22:30 IST)
Kriti setty, Uppena pressmeet
హీరో వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్న “ఉప్పెన”తోనే తెలుగులో తాను కూడా మొదటగా అడుగు పెట్టి విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకున్న హీరోయిన్ కృతి శెట్టి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్‌గా సిల్వర్ స్క్రీన్‌ను హిట్ చెయ్యడానికి రెడీగా ఉన్న ఈ బ్యూటీ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ వివ‌రాలు.
 
ప్రీరిలీజ్‌లో చిరంజీవిగారు మిమ్మ‌ల్ని అంత‌గా పొగిడారే? ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవ‌రు ఇచ్చారు?
సినిమా చూసిన సుకుమార్, కొరటాల శివ గారు మా ప్రొడ్యూసర్ నవీన్ గారు అయితే ఫోన్ చేసి నా పెర్ఫామెన్స్ కోసం షివర్ అవుతూ చెప్పారు. కానీ మా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నా పెర్ఫామెన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడ్డం ఓ మై గాడ్ అనిపించింది. అంత గొప్ప యాక్టర్ నా కోసం మాట్లాడ్డం నాకు చాలా గర్వంగా అనిపించింది.
 
గూగుల్ లో అద్వైత అనే పేరుతో వుంది మీ పేరేనా.?
అది నా పేరు కాదు. నా లాంటి పేరు తోనే కృతి శెట్టి అనే అమ్మాయి మరొకరు ఉంది. ఆమె తర్వాత అద్వైత అని మార్చుకుంది. వికీపీడియాలో అలా లింక్ అయ్యిపోయింది ఆ పేరు నాది కాదు.
 
ఈ సినిమా ఎలా వచ్చింది?
నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ కెరీర్ అనుకోలేదు. నేనెప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను. కానీ ఈ ఆఫర్ వచ్చినప్పుడు బాగుంది అనిపించింది. స్టోరీ విన్నాక చాలా నచ్చింది. అందుకే ఈ సినిమా చేశాను.
 
హీరోకు మీకు ఇదే ఫస్ట్ సినిమా ఈ విషయం ఎప్పుడైనా మాట్లాడుకున్నారా?
ప్ర‌మోష‌న్ ఇంటర్వ్యూస్ లోనే మాట్లాడుకున్నాం నాకు కూడా వైష్ణవ్ కు ఫస్ట్ సినిమా అనే ఈ విషయం తెలీదు.
 
నిజంగా ఫస్ట్ సినిమాకే తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు,ఎవరు నేర్పించారు?
ఈ విషయంలో డైరెక్టర్ గారు చాలా హెల్ప్ చేశారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ వివేక్, రాహుల్ అనే ఒకాయన చాలా బాగా హెల్ప్ చేశారు. హీరో కూడా నాకు నేర్పించారు. అందుకే వచ్చేసింది.
 
షూటింగ్‌లో మీ బెస్ట్ మెమొరీ ఏంటి?
ఈ సినిమా షూట్లో బెస్ట్ మెమొరీ ఏంటంటే..ఒక ఎమోషనల్ సీన్ చేసాక డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ మానిటర్ వెనుక ఉన్న వారు అంతా చూసి ఏడ్చేశారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. విజయ్ సేతుపతి గారితో యాక్ట్ చెయ్యడం కూడా.
 
విజయ్ సేతుపతి గారితో యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
విజయ్ సేతుపతి గారు సెట్స్‌లో చాలా కామ్‌గా క్యూట్‌గా ఉంటారు. కానీ యాక్షన్ అండ్ కట్ చెప్పే టైంలో మాత్రం టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇస్తారు. మా ఇద్దరి మధ్య ఒక పెద్ద సీన్ ఉంటుంది అది చేయగలనా లేదా అన్నపుడు సేతుపతి గారు కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు. ఆ సీన్ చాలా బాగుంటుంది.
 
ఈ సినిమా ఒప్పుకున్నపుడు మెగాఫ్యామిలీ వుంద‌ని తెలుసా?
నాకు చిరంజీవి గారు తెలుసు కానీ మిగతా ఎవరి గురించి కూడా తెలీదు. కానీ సుకుమార్ గారు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు అదే ఈ సినిమా చెయ్యడానికి నాకు చాలా హెల్ప్ అయ్యింది.
 
వైష్ణవ్ న‌ట‌న ఎలా అనిపించింది?
నిజానికి వైష్ణవ్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండేవాడు. అలాగే తానొక బ్రిలియెంట్ యాక్టర్. అది ఈ 12న చూస్తారు. అలాగే తన ఫస్ట్ మూవీలోనే ఇలా యాక్ట్ చెయ్యడం మామూలు విషయం కాదు తన దగ్గర నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను.
 
యాక్టింగ్ తెలీదు. మరి ఈ సినిమా ఎలా హ్యాండిల్ చేశారు?
నేను యాక్టింగ్ నేర్చుకోలేదు. అలాగే ప్రొఫెషినల్స్ హెల్ప్ కూడా తీసుకోలేదు. కొన్ని సీన్స్ కాస్త డిఫికల్ట్ అనిపించాయి. ఆ టైం డైరెక్టర్ బుచ్చిబాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను మోటివేట్ చేసి చేయించారు అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమ్ముట్టి, పృద్విరాజ్ సుకుమార్, ఆర్య న‌టించిన `గ్యాంగ్స్ ఆఫ్-18` ట్రైలర్