3 నిమిషాల పాటకు రూ.20 లక్షలు వసూలు చేస్తున్న అనసూయ

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (17:22 IST)
బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి అనసూయ భరద్వాజ్. ఈమె అపుడపుడూ వెండితెరపై కూడా కనిపిస్తోంది. రంగస్థలం చిత్రంల రంగమ్మత్తగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అలాగే, అడపాదడమా ఐటమ్ సాంగుల్లో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ చిత్రంలో ‘సుయా సుయా అనసూయ’ పాటకు, విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ నటించిన ‘ఎఫ్‌-2’లో ‘డింగు డాంగ్‌’ పాటపై మెరిసింది.
 
తాజాగా ‘చావు కబురు చల్ల’గా చిత్రంలోనూ ఐటెంసాంగ్‌ చేసేందుకు సమ్మతించింది. ఈ చిత్రంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తుండగా.. కౌశిక్‌ దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే, మూడు నిమిషాల స్పెషల్‌ సాంగ్‌కు అనసూయకు రూ.20లక్షలు చెల్లిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
 
చిత్ర కథ నేపథ్యంలో సాగే స్పెషల్‌ సాంగ్‌ ఎంతో కీలకంగా ఉంటుందని, ఈ మేరకు చిత్ర దర్శకుడు కౌశిక్,‌ అనసూయను ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాంగ్ షూట్ హైదరాబాద్‌లో జరుగుతోంది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరో వైపు అనసూయ ‘థాంక్స్ బ్రదర్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. మొత్తంమీద అటు బుల్లితెర, ఇటు వెండితెరపై రాణిస్తూ రెండుచేతులా సంపాదిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments