జబర్దస్త్ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన అందాలన ఒలకపోసే ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వుంటుంది. ఇందులో ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కూడా వున్నాయి. తాజాగా కొత్త సంవత్సరాదిని అనసూయ భరద్వాజ్ అయితే ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. తన భర్తతో కలిసి న్యూ ఇయర్‌కు వెల్ కమ్ చెప్పింది.
తాజాగా కొత్త ఏడాది సందర్భంగా చిట్టిపొట్టి స్కర్టులో పిచ్చెక్కించింది అనసూయ. ముఖ్యంగా భర్తతో రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. భరద్వాజ్ బుగ్గ గిల్లుతూ.. అనసూయ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతా న్యూ ఇయర్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తే అనసూయ మాత్రం కాశీకి వెళ్లారు. అక్కడే భర్తతో పాటు ఫుల్లుగా ఎంజాయ్ చేసింది ఈ బ్యూటీ. అంతకంటే ముందు మరో చిట్టి నిక్కరులో అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఆ తర్వాత వన్ విత్ మై మిస్టర్ విత్ కాశీ అంటూ పోస్ట్ చేసింది అనసూయ. ఈ ఫోటోకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు లక్ష లైకులు సంపాదించింది. ప్రస్తుతం కెరీర్‌లో కూడా ఫుల్ జోష్ మీదుంది అను. అటు సినిమాలు చేస్తూ.. ఇటు జబర్దస్త్ కామెడీ షోను కూడా హోస్ట్ చేస్తుంది.