Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ నుంచి కోలుకున్న అమితాబ్ బచ్చన్!

Webdunia
గురువారం, 23 జులై 2020 (18:03 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. ఇటీవల అమితాబ్‌తో పాటు... ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు తొలుత కోవిడ్ వైరస్ సోకింది. దీంతో వారిని ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఆ తర్వాత అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్యలు ఈ వైరస్ బారినపడ్డారు. వీరిని కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు. 
 
ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చారు. కరోనా గురించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ధైర్యం చెప్పారు. తాము కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
 
తాజాగా అమితాబ్ ఆరోగ్యం గురించి నానావతి ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ... ఆయన టెస్టు రిపోర్టులన్నీ సాధారణంగానే ఉన్నాయనీ పేర్కొన్నాయి. బ్లడ్, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు. 
 
మరోవైపు, అమితాబ్‌కు ఇంకా ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదనీ, తనకు కరోనా నెగెటివ్ అంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అమితాబ్ కుటుంబ సభ్యులు స్పందించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments