Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో "లూసిఫర్" రీమేక్... మెగాస్టార్‌తో స్టైలిష్ స్టార్

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:33 IST)
మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ చిత్రంలో నటించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రాన్ని ఆయన తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం మోహన్ లాల్ సినీ కెరీర్‌లోనే ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కన్ను ఈ చిత్రం రీమేక్‌పై పడింది. దీంతో మలయాళ హక్కులను చిరంజీవి తనయుడు హీరో కమ్ నిర్మాత రాంచరణ్ భారీ మొత్తానికే కొనుగోలు చేశారు.
 
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి  చేసిన తర్వాత లూసిఫర్ రీమేక్‌పై చిరంజీవి దృష్టిసారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ఓ పాత్రలో అంటే చిరంజీవికి నమ్మినబంటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రను అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారట. అల్లు అర్జున్ కూడా ఆ పాత్ర పట్ల ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
 
కాగా, 'లూసిఫర్' సినిమాలో మోహన్ లాల్‌కి నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments