రావణ కాష్టంలా తెలంగాణ.. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి: వైఎస్‌ షర్మిల

Webdunia
శనివారం, 1 మే 2021 (16:16 IST)
కరోనాతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైందని వైఎస్‌ షర్మిల చెప్పారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని తెలిపారు. కరోనా బారిన పడిన వారికి ఊరట కలిగించాలన్నారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడాలని వైఎస్‌ షర్మిల తెలిపారు. 
 
శనివారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఇంకెప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తారని సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. ప్రతి 100 మందిలో 10 మందికి కరోనా వస్తోందన్నారు. ఆ 10 మందిలో 9 మంది పెద్దవాళ్లేనని చెప్పారు. 
 
రాష్ట్రంలో కరోనా టెస్టులు లేవని,ఆసుపత్రులలో బెడ్స్ లేవని, పట్టించుకునే డాక్టర్స్ లేరని ధ్వజమెత్తారు.ఇక ఆసుపత్రులలో ఊపిరి నిలిపే ఆక్సిజన్ సిలిండర్లు లేవని ,బతికించే వ్యాక్సిన్ లేదని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
 
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రెమ్‌డెసివర్, వాక్సీన్‌, ఆక్సీజన్, ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో గానీ ఏ మాత్రం లోపం రానీయవద్దని సీఎస్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.
 
అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గానూ సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని కేసీఆర్ నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. అధికారులంతా చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణను కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments