Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్లపాటు రేప్ చేశాడు... ఇప్పుడు ఫ్రెండ్స్​తో కలిసి వీడియోలు..

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:37 IST)
వరుసకు చెల్లి అయ్యే బాలికపై కన్నేశాడు. స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి బెదిరించాడు.. ఏకంగా రెండేళ్లపాటు రేప్ చేశాడు. ఇప్పుడు ఫ్రెండ్స్​తో కలిసి అఘాయిత్యం చేశాడు.

అందరూ వీడియోలు తీసుకుని వాట్సాప్, ఫేస్​బుక్​లో పోస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో జరిగిందీ పైశాచిక ఘటన. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను మెట్ పల్లి డీఎస్పీ గౌస్ బాబా తెలిపారు.
 
వీడియోలు తీసి.. షేర్ చేసి..
మెట్​పల్లికి చెందిన ఓ బాలిక (14) ఇంటిపక్కనే వరుసకు అన్న అయ్యే రాజేశ్ ఉంటున్నాడు. రెండేళ్ల కిందట బాలిక స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను బాలికకు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. తాను చెప్పిన దానికి ఒప్పుకోక పోతే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

అమ్మాయిని లొంగదీసుకుని రెండేండ్లలో పలుసార్లు అత్యాచారం చేశాడు. 20 రోజుల కిందట బాధితురాలికి ఫోన్ చేసి ఓ స్కూల్ వెనకాల ఉన్న గోడ వద్దకు రావాలని చెప్పాడు. బాలిక అక్కడికి వెళ్లగానే రాజేశ్ ఆమెను మరోసారి రేప్ చేశాడు. దీన్ని అతని స్నేహితులు వీడియో తీశారు.

తర్వాత దారంగుల సాయిలు, మొగిలిపాక అనిల్ కుమార్, కుంచెపు శివ, కుంచెపు వెంకటేశ్ రేప్ చేశారు. వీరందరూ అత్యాచారం చేసేటప్పుడు ఒక్కొక్కరు వీడియోలు తీసి వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం బయటికి వచ్చింది.

బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు సెల్ ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments