Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక అమ్మాయి.. ముగ్గురబ్బాయిలు.. శ్రావణి కథ ఇదే

Advertiesment
TV Actress Sravani Suicide case
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:35 IST)
టీవీ సీరియల్‌ నటి శ్రావణి 2012లో హైదరాబాద్‌కు వచ్చి ఆర్టిస్ట్‌గా పని చేసింది. 2015లో ఆమెకు సాయికృష్ణారెడ్డితో, అతడి ద్వారా 2017లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ నిర్మాత అశోక్‌రెడ్డితో పరిచయమైంది.

2019లో దేవరాజు టిక్‌టాక్‌ ద్వారా పరిచయమయ్యాడు. అతణ్ని పెళ్లి చేసుకుందామని శ్రావణి భావించింది. ఆమె దేవరాజుకు దగ్గరవడాన్ని గమనించిన సాయి.. ఆ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు చెప్పాడు.

దీంతో గొడవలు మొదలయ్యాయి. శ్రావణి తల్లిదండ్రులు కూడా ఆమెను ఇబ్బంది పెట్టారు. సాయితో కలిసి ఆమెను కొట్టారు. మరోవైపు.. దేవరాజు కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రావణిని మోసం చేశాడు.
 
సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ శ్రావణికి ఆశ చూపిన అశోక్‌రెడ్డి ఆమెతో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారని తెలిసింది.

గత ఎనిమిది నెలలుగా ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడని.. సాయికృష్ణ ద్వారా ఆమెపై ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు ప్రయత్నించాడని సమాచారం. ఈ నెల 7న అమీర్‌పేటలోని ఓ హోటల్‌ వద్ద శ్రావణి, దేవరాజ్‌ల మధ్య జరిగిన గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.

అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డితో పాటు మిగతా అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన పరిణామాల్లో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. అశోక్‌ రెడ్డిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19న హైదరాబాద్‌ లో కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం