Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేప్ కేసుల విచారణపై కొత్త గైడ్ లైన్స్

Advertiesment
New guidelines
రేప్ కేసులకు సంబంధించిన దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నేరం జరిగిన వెంటనే పోలీసులు ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

సరైన సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం శాఖ అడ్వైజరీ జారీ చేసింది.

రాష్ట్రాలు, యూటీలు ఈ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఈ రూల్స్ కు పోలీసులు కట్టుబడి ఉండాలని, లేదంటే బాధితులకు న్యాయం చేయలేమని చెప్పింది.

ఉత్తర్ ప్రదేశ్‌‌‌‌లోని హత్రాస్‌‌‌‌లో 19 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం మూడు పేజీలతో కూడిన అడ్వైజరీని తాజాగా జారీ చేసింది.
 
గైడ్ లైన్స్ ఇవీ..
అత్యాచార ఘటనలతోపాటు నిందితుల్ని అరెస్టు చేసేంత తీవ్రత ఉన్న కేసుల విషయంలో పోలీసులు వెంటనే ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయాలి. సంబంధిత పోలీస్ స్టేషన్‌‌‌‌ పరిధి బయట ఘటన జరిగితే జీరో ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ రికార్డు చేయాలి. ఇలా ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయడంలో ఫెయిల్ అయిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి.

సీఆర్‌‌‌‌పీసీలోని సెక్షన్ 173 ప్రకారం అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తిచేయాలి. ఈ కేసుల విచారణను ట్రాక్ చేయడానికి కేంద్ర హోం శాఖ ఆన్‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌ను తీసుకొచ్చింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తీరును పర్యవేక్షించేందుకు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) పేరుతో పోర్టల్ ను ఏర్పాటు చేసింది.

ప్రత్యేకంగా లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు ఇది అందుబాటులో ఉంటుంది. లైంగిక దాడి/అత్యాచార కేసుల్లో బాధితులకు రిజిస్టర్డ్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలి. పోలీసులకు సమాచారం అందిన 24 గంటల్లోగా టెస్టులు చేయించాలి. ఒకవేళ బాధితులు చనిపోతే.. చనిపోవడానికి ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించాలి.

కొన్ని సందర్భాల్లో మేజిస్ట్రేట్, పోలీసుల సమక్షంలో రికార్డు కాకుంటే.. ఆ కారణంతో బాధితులు ఇచ్చే మరణ వాంగ్మూలాన్ని విస్మరించకూడదు. జ్యుడీషియల్ స్క్రూటినీ రిక్వైర్​మెంట్లకు అనుగుణంగా స్టేట్‌‌‌‌మెంట్ ఉన్నప్పుడు దాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోవాలి.

లైంగిక దాడుల విషయంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించేందుకు కేంద్రం ఇచ్చిన సెక్సువల్ అస్సాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్(ఎస్‌‌‌‌ఏఈసీ) కిట్లను ఉపయోగించాలి. లైంగిక దాడుల నేరస్థులను గుర్తించేందుకు, మళ్లీ నేరాలు చేయకుండా ట్రాక్ చేసేందుకు జాతీయ డేటా బేస్ ను రాష్ట్రాలు, యూటీలు ఉపయోగించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారటోరియం పొడిగింపు కుదరదు: ఆర్బీఐ