Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికల సందడి : అలాంటి వారు ఇంటి నుంచే ఓటేయొచ్చు... ఎలా?

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (16:04 IST)
దేశంలో గత 2014లో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. తొలి రెండు దఫాల్లో ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ఇపుడు భారత రాష్ట్ర సమితి) అధికారంలోకి వచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలుపొందిన తెరాస.. 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రజాదారణ తగ్గింది. ఇపుడు మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడనుంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా, తెలంగాణ రాష్ట్రంలో నవంబరు 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. అదే రోజునుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచే ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వచ్చింది. 2024 జనవరి 16తో రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనున్నది. 
 
ఈ అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల ద్వారానే నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్‌లోనూ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో 72,933 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి అవసరానికంటే 209 శాతం అదనంగా ఉన్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. కంట్రోల్ యూనిట్లు 57,691 (165 శాతం అధికంగా), వీవీ ప్యాట్లు 56,745 (163 శాతం అధికంగా) ఉన్నాయి. ఈవీఎంల పరిశీలనను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే పూర్తి చేశారు. 
 
మరోవైపు, ఈ ఎన్నికల నిర్వహణ కోసం 2 లక్షల మంది అధికారులను సిబ్బందిని వినియోగించనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజున పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. వీరికి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే శిక్షణలు ప్రారంభమయ్యాయి. ప్రిసైడింగ్ అధికారుల క్యాటగిరీ వరకు దాదాపుగా అన్ని రకాల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. 
 
అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు 1,96,312 మంది సిబ్బంది అవసరమని, 2,01,126 సిబ్బంది ఉన్నారని గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు అత్యవసరంగా మరో రెండు శాతం సిబ్బందిని రిజర్వ్ ఉంచుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. 
 
అలాంటి వారికి ఇంటి నుంచే ఓటు హక్కు... 
ఈ దఫా ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 80 యేళ్లు దాటినవారికిస 40 శాతం కంటే ఎక్కువ వైఫల్యం ఉన్నావారికి ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును తొలిసారి కల్పించింది. ఆ ప్రకారంగా రాష్ట్రంలో 80 ఏండ్లు పైబడిన వారు 4.44 లక్షల మంది ఉండగా, 100 ఏండ్లకు పైబడిన వారు 7,689 మంది ఉన్నారు. 5.06 లక్షల మంది దివ్యాంగులు ఓటరుగా నమోదు చేసుకున్నారు. వీరికి సౌలభ్యంగా ఉండేలా అనువైన విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. అయితే, ఇంటి నుంచే ఓటు వేయడానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 12 డీ ఫారంను పూర్తి చేసి స్థానికంగా ఉండే బూత్ లెవల్ ఆఫీసర్‌కు సమర్పించాలి. 12 డీ ఫారంను పూర్తి చేసిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తారు. వీరు ఇంట్లో ఉండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments