Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఖిల్‌ ఏజెంట్‌కు షిర్డి సాయి ఆశీస్సులు దక్కేనా!

Advertiesment
Rajamudry akil fans yatra
, బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (09:14 IST)
Rajamudry akil fans yatra
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అఖిల్‌ బాలనటుడిగా సిసింద్రీతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత స్పోర్ట్స్‌మెన్‌గా కెరీర్‌ను కొనసాగించాలనుకున్నా యాదృశ్చికంగా సినిమా హీరో అయ్యాడు. 2014లో అఖిల్‌ అనే పేరుతోనే తనను తాను హీరోగా పరిచయం చేసుకున్నాడు. అది పెద్దగా ఆదరణ పొందలేదు. ఆ తర్వాత మనం సినిమాలో క్లయిమాక్స్‌లో మెరుపుతీగలా మెరిసి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అనంతరం కథానాయకుడిగా హలో, మిస్టర్‌ మజ్ఞు, మోస్ట్‌ ఎలిజిబిల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాలు చేసినా బ్లాక్‌బస్టర్‌ స్థాయికి చేరుకోలేకపోయాడు. అందుకే రెండేళ్ళ గేప్‌ తీసుకుని దర్శకుడు సరేందర్‌ రెడ్డితో ఏజెంట్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ సాంగ్‌ కూడా విడుదలకాబోతోంది. ఇందులో నటించిన నాయిక సాక్షివైద్య ఏజెంట్‌ సాంగ్‌ అదిరిపోవాలని ట్వీట్‌ చేసింది.
 
ఇదే రోజు మరో ప్రత్యేకత చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన అక్కినేని అభిమానులు అఖిల్‌ విజయాన్ని కాంక్షిస్తూ షిర్డి యాత్రను ప్రారంభించారు. షిరిడిసాయి ఆశీస్సులతో అఖిల్‌ ఏజెంట్‌ ఇండస్ట్రీ హిట్‌ కావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేయడానికి బయలుదేరారు. వెళ్ళేముందు అఖిల్‌ ఏజెంట్‌ పోస్టర్‌కు మహిళలు కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి అభిమానులుకు శుభాశీస్సులు తెలిపారు. 
 
గతంలో స్టార్‌ హీరోలకు వుండే ఈ సాంపద్రాయం ఇప్పుడు వారి వారసులకు చేరింది. ఏజెంట్‌ సినిమాలో మమ్ముట్టి, పూజా హెగ్డే, డినోమోరియా వంటి తారలు నటించారు. త్వరలో ఈ సినిమా గురించి మరో అప్‌డేట్‌ రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5డీ కెమెరాలతో షార్ట్ ఫిలింస్ చేసేవాళ్ళం : హీరో విశ్వ‌క్ సేన్‌