Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే జ్ఞానోదయమైంది : విజయశాంతి

Webdunia
బుధవారం, 19 మే 2021 (10:04 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే జ్ఞానోదయమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఆమె స్వాగతించారు. 
 
సీఎంగారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించిన ఆ దైవానికి కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లపై బీజేపీ ఒత్తిళ్లకు కేసీఆర్ దిగొచ్చారన్నారు. అయితే, గత 15 నెలల కాలంలో కరోనాతో బాధపడి ఆసుపత్రి బిల్లులు చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్‌మెంట్ చేస్తుందన్న నిర్ణయాన్ని కూడా కేసీఆర్ ప్రకటించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
 
ఓవైపు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, జల ప్రాజెక్టుల కమిషన్లు ఉండగానే... టీఆర్ఎస్ దొరల అనుచర బంధుగణం మెడికల్ మాఫియా అవతారం ఎత్తిందని విమర్శించారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ తోపాటు కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విజయశాంతి మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments