Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (08:29 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం దేశ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటలకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ జరుగనుంది. 
 
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 50 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం హైదరాబాద్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
మరోవైపు, పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులను అనుమతించరు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆడ్మిట్ కార్డు విధిగా చూపించాల్సివుంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. కాగా, ఈ పరీక్షా ఫలితాలను నెల రోజుల లోపు విడుల చేసేలా ప్లాన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments