ఇటీవలే సినిమా టిక్కెట్ల పెంపు, ఆ తర్వాత తగ్గింపు విషయమై చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతోంది. భారీ సినిమాలకు ఇష్టంవచ్చినట్లు పెంచుకోవచ్చనే వారంరోజులపాటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఆం ద్రలో అటువంటిది లేదు. అయితే ఇటీవల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిండచడంతో వారికోసం ఎఫ్3 వంటి కొన్ని సినిమాలు మామూలు రేట్లకే అమ్మడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ విషజ్ఞమైన అరవింద్, బన్నీవాస్ దీనిపై స్పందించారు.
నిర్మాత బన్నీ వాసు టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ, రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు ,తాను మొదటి వ్యక్తులమని పేర్కొన్నారు. నైజంలో 160+gst, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+gst, సింగిల్ స్క్రీన్ లో 100+gst అని అన్నారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాలనే తమ ఉద్దేశ్యమని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్ టికెట్‌పై ఆయన స్పందించలేదు. త్వరలో చలనచిత్రరంగం పెద్దలు కలిసి మాట్లాడుకుంటామన్నారు.