Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదారాబాద్ మైనర్ బాలిక రేప్ కేసులో హోం మంత్రి మనవడు?

rape victim
, శనివారం, 4 జూన్ 2022 (13:46 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ కారులో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. ఈ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్టాన్ అహ్మద్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పుర్టాన్ అహ్మద్ తన స్నేహితులకు అమ్నేషియా పబ్‌లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారనే విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, ఈ ఆరోపణలపై పుర్టాన్ అహ్మద్ తోసిపుచ్చాడు. తనకు ఆ గ్యాంగ్ రేప్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా భావిస్తున్న రోజున తాను మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నానని వెల్లడించాడు. పైగా, తాను ఆ రోజు ఎవరికీ ఎలాంటి బ్యాచిలర్ పార్టీ ఇవ్వలేదని స్పష్టం చేశాడు. పార్టీలో పాల్గొన్నవారు, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినవారు ఎవరో తనకు తెలియదని చెప్పారు. అదేసమయంలో తనపై ఆరోపణలు చేసేవారు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. 
 
ఇదిలావుంటే ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేయగా, వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటితో ముగియనున్న గ్రూపు-1 దరఖాస్తు గడువు