Publish Date: Mon, 03 Jan 2022 (12:11 IST)
Updated Date: Mon, 03 Jan 2022 (12:13 IST)
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా ఆయన జాగరణ దీక్షను తలపెట్టారు. దీనికి రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
పైగా, ఆయన తన నివాసంలోనే ఈ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన నివాసంలోనే దీక్షకు దిగగా, దీన్ని పోలీసులు భగ్నం చేశారు. అదేసమయంలో ఆయన్ను అరెస్టు చేసే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టు వదలకుండా ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అరెస్టు చేశారు.
ఒకవైపు కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ అనుమతి లేకున్నప్పటికీ దీక్ష చేయడానికి పూనుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అందుకే ఆయనపై నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేసినట్టు సమాచారం.
ఠాగూర్
Publish Date: Mon, 03 Jan 2022 (12:11 IST)
Updated Date: Mon, 03 Jan 2022 (12:13 IST)