యువతి నగ్న చిత్రాలు తీసి ఆమెకే పంపిన యువకులు.. ఆ తరువాత?

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (14:17 IST)
ఒంటరిగా ఉన్న యువతిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నారు ఇద్దరు యువకులు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలన్న ఉద్దేశంతో రకరకాల ప్లాన్లు వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కానీ చివరకు ఆ యువతి నగ్నచిత్రాలు తీసి ఆమెకే వాట్పాప్ ద్వారా పంపారు. హైదరాబాద్‌లో ఈ సంఘటన జరిగింది.
 
సైబర్ క్రైం పోలీసులకు అందిన సమాచారం మేరకు... పాతబస్తీకి చెందిన ఓ వివాహిత భర్తతో విభేదాల కారణంగా తల్లిదండ్రుల వద్దే గత నాలుగు నెలలుగా ఉంటోంది. ఆ వివాహిత ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఆమెకు స్నేహితురాలిగా ఉన్న మరొక యువతి సహాయం తీసుకున్నారు.
 
తమ వీధిలో ఒక పుట్టినరోజు వేడుక జరుగుతుండగా ఆ వేడుకకి ఆ యువతిని రప్పించారు. ఆమె భోజనం చేసిన తర్వాత జ్యూస్ తాగుతుండగా ఆ యువతి చీరపై ఆమె స్నేహితురాలు కూల్ డ్రింక్ పోసింది. ఆ తర్వాత అరెరే... దుస్తులపై జ్యూస్ పడింది... బట్టలు మార్చుకో అంటూ ఒక గదిలోకి తీసుకెళ్ళింది. అప్పటికే ఆ ఇద్దరు యువకులు ఆ గదిలో ఒకచోట నక్కి వున్నారు. యువతి చీర మార్చుకుంటున్న దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియో ఫోటోలను మరుసటి రోజు ఆమె మొబైల్‌కు, ఆమె సోదరుడు మొబైల్‌కు పంపారు. దీంతో బాధితురాలు, ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం