Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లైన నాటి నుంచి వేధింపులే.. భర్త తలను నరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది..

Advertiesment
Assam
, గురువారం, 30 మే 2019 (17:47 IST)
పెళ్లైన నాటి నుండి భర్త వేధింపులకు గురి చేస్తుండటంతో సంవత్సరాల తరబడి ఓపిక పట్టిన భార్య, రోజురోజుకీ భర్త ఆగడాలు మితిమీరిపోతుండటంతో ఇక భరించలేక ఏకంగా భర్తనే హత్య చేసింది. ఈ దారుణమైన సంఘటన అసోంలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే అసోంలోని లఖీంపూర్‌ జిల్లాకు చెందిన గుణేశ్వరి అనే మహిళకు తన మధురిం అనే వ్యక్తితో చాలా సంవత్సరాల క్రితమే వివాహమైంది, అప్పటి నుండి మధురిం తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. చాలాసార్లు మద్యం తాగి వచ్చి గుణేశ్వరిని కత్తులు, గొడ్డలి వంటి మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచాడు. ఆమెకు పిల్లలు ఉండటంతో వారి కోసం ఇన్నాళ్లు భర్త ఆగడాలను సహనంతో భరించింది.
 
అయితే భర్త ఆగడాలు రోజు రోజుకీ ఎక్కువవుతుండడంతో అతడిని చంపడమే పరిష్కారంగా భావించింది. అలవాటు ప్రకారం తాగి ఇంటికి వచ్చిన భర్త ఆమెతో గొడవ పడడం ప్రారంభించాడు. అప్పటికే అతన్ని చంపాలని నిర్ణయించుకున్న గుణేశ్వరి మద్యం మత్తులో ఉన్న తన భర్తపై పెద్ద కత్తితో దాడితో చేసింది. ఏకంగా తల నరికేసింది. 
 
దాన్ని తీసుకొని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కి నడిచి వెళ్లి లొంగిపోయింది. రోజూ తాగి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, అతని హింసను తాళలేకే హత్య చేసినట్లు అంగీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆమెను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్‌ విధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?