Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిరాణాకొట్టులో గర్భస్రావం.. రూ.4 వేలకే నకిలీ వైద్య దంపతుల చికిత్స

Advertiesment
కిరాణాకొట్టులో గర్భస్రావం.. రూ.4 వేలకే నకిలీ వైద్య దంపతుల చికిత్స
, బుధవారం, 29 మే 2019 (17:56 IST)
కిరాణాకొట్టులో పదేళ్ల పాటు చట్ట విరుద్ధంగా గర్భస్రావాలు చేస్తూ వచ్చిన నకిలీ వైద్య దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై, అవలూరుపేట రోడ్డులో ఓ మహిళా వైద్యురాలు చట్ట విరుద్ధంగా గర్భస్రావాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన విచారణలో దంపతులు చట్టవిరుద్ధంగా గర్భస్రావాలు చేస్తున్నట్లు తెలిసింది. 
 
పదో తరగతి వరకు చదువుకున్న కవిత తమిళనాడు, అవలూరుపేట్ట రోడ్డులో ఓ కిరాణ కొట్టును నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ప్రభు అదే ప్రాంతంలో మెడికల్స్ నడుపుతున్నారు. వీళ్లిద్దరూ కవిత కిరాణాకొట్టులోనే గర్భస్రావాలు చేయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. 
 
ప్రభుత్వాసుపత్రికి వచ్చే మహిళల్లో చాలామంది ఈ కిరాణాకొట్టులో గర్భస్రావాలు చేయించుకుంటున్నట్లు తెలియరావడంతో.. ఆరోగ్య శాఖాధికారులు కూడా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కవిత- ప్రభు కిరాణాకొట్టు, మెడికల్స్‌పై పోలీసులు తనిఖీలు చేపట్టారు. 
 
ఈ తనిఖీల్లో గర్భస్రావానికి సంబంధించిన మాత్రలు, ఉపకరణాలు ఉండటం గమనించారు. వెంటనే ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద జరిపిన విచారణలో పదేళ్ల పాటు ఈ తంతు జరుగుతుందని.. రోజుకు మూడు లేదా నాలుగు గర్భస్రావాలు చేస్తామని వెల్లడించారు. కళాశాల విద్యార్థులతో పాటు వివాహితులకు గర్భస్రావాలు చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదివరకు నాలుగు వేల గర్భస్రావాలు చేయించారని తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క ఛాన్స్ నినాదమే కొంపముంచిది సార్ .. ప్రమాణ స్వీకారానికి వద్దు : టీడీపీ నేతలు