Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యలను సం'తృప్తి' పరిచేందుకు మేల్ ఎస్కార్టలను బుక్ చేస్తున్న భర్తలు.. ఎక్కడ?

Advertiesment
భార్యలను సం'తృప్తి' పరిచేందుకు మేల్ ఎస్కార్టలను బుక్ చేస్తున్న భర్తలు.. ఎక్కడ?
, సోమవారం, 20 మే 2019 (11:47 IST)
ఇప్పుడు చాలా దేశాల్లో మేల్ ఎస్కార్ట్‌లకు డిమాండ్ ఎక్కువవుతోంది. శారీరక సుఖాన్ని కోరుకునే మహిళలకు ఆ సుఖాన్ని అందించడమే మేల్ ఎస్కార్ట్‌ల పని. సాధారణంగా తమ భాగస్వామితో సంతృప్తి చెందని మహిళలే మేల్ ఎస్కార్ట్‌లను కోరుకుంటున్నారని సమాచారం. 
 
అయితే ఆస్ట్రేలియాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ దేశంలో భర్తలే తమ భార్యలకు శారీరక సుఖాన్ని అందించడం కోసం మేల్ ఎస్కార్ట్‌లను బుక్ చేస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో మేల్ ఎస్కార్ట్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల అలెక్స్ అనే వ్యక్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించాడు. కొందరు భర్తలే తమ భార్యలకు శారీరకంగా సుఖాన్ని ఇవ్వమని తనను బుక్ చేస్తున్నారంటూ తెలిపాడు.
 
దీని గురించి వివరాలు తెలియజేస్తూ అలెక్స్ "సహజంగా తాను గంటకు 500 డాలర్లు వసూలు చేస్తానని, అయితే ఒకసారి తన వల్ల ఒక వ్యక్తి భార్య చాలా ఎంజాయ్ చేసిందని, ఆ భర్త వెయ్యి డాలర్లు టిప్పు కూడా ఇచ్చినట్లు తెలియజేసాడు". చాలా మంది భర్తలు ఆఫీసు పనుల్లో చికాకు, ఒత్తిడి వల్ల తమ భార్యలకు శారీరక సుఖాన్ని ఇవ్వలేకపోతున్నారని అలెక్స్ చెబుతున్నాడు. 
 
సహజంగా 35 నుంచి 45 ఏళ్ల వయసున్న మహిళలే తనను ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారని అలెక్స్ తెలిపాడు. బిడ్డల తల్లులు, వ్యాపారవేత్తలు, కాలేజీ అమ్మాయిలు ఇలా అన్ని రంగాలకు చెందినవారు శారీరక సుఖం కోసం తనను సంప్రదిస్తున్నట్లు చెప్పాడు. అమ్మాయిలు మేల్ ఎస్కార్ట్‌లను ఎంచుకోవడానికి సమయం, నిరాశే ప్రధాన కారణాలని అలెక్స్ చెబుతున్నాడు. 
 
జిమ్ ట్రైనర్‌గా పనిచేసిన అలెక్స్ ఎస్కార్ట్ వృత్తి నచ్చడంతో ఇందులోకి వచ్చినట్టు, ఇందులో డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నట్టు చెప్పాడు. తాను ఓ వెబ్‌సైట్ తరపున పనిచేస్తున్నానని.. కంపెనీ నియమాల ప్రకారం మూడు నెలలకు ఒకసారి టెస్ట్‌లు కూడా చేయించుకుంటున్నానని తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుమానం హత్యకు కారణమైంది.. భార్యను చేతబడి చేసి చంపేశాడని?