Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు శుభవార్త.. ఏంటది?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (19:48 IST)
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆగస్టు 24 సెప్టెంబర్ 7వ తేదీ వరకు చేపట్టనున్నారని తెలిపింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 22వ తేదీ మధ్యలో ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టు ఇవ్వాలి. 
 
రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత అడ్మిషన్లకు సంబంధించి సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 16న ఉంటుంది.
 
ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్లు : ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు
వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం : ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు
మొదటి విడత సీట్ల కేటాయింపు : సెప్టెంబర్ 16న
విద్యార్థుల సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ : సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు
 
రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం : సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు
రెండో విడత సీట్ల కేటాయింపు : సెప్టెంబర్‌ 28న
మూడో విడత సీట్ల కేటాయింపు : అక్టోబర్‌ 8న
రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం : సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 3 వరకు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments