Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాధ్యత ఉండక్కర్లేదా? లేఖలు రాసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?

బాధ్యత ఉండక్కర్లేదా? లేఖలు రాసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?
, గురువారం, 20 ఆగస్టు 2020 (17:45 IST)
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాలపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అపరాధం విధించింది. ఆరేళ్లు గడిచినా విభజన సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల పోలీసు కేడర్‌ విభజన ప్రక్రియపై మండిపడింది. ఈ కసరత్తును తక్షణం పూర్తి చేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. 
 
కేడర్‌ విభజనపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే జరిగిన జాప్యం, ఇతర అంశాలపై న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తూ, కేంద్రానికి బాధ్యత లేదా అని నిలదీసింది.   
 
కేడర్‌ విభజన చేపట్టాలంటూ లేఖలు రాస్తే సరిపోతుందా... ఇందులో జోక్యం చేసుకొని సానుకూలంగా కేడర్‌ విభజన జరిగేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తూ, తెలంగాణ, కేంద్రానికి రూ.5 వేల చొప్పున అపరాధం విధించింది. 
 
కేడర్‌ విభజనపై తెలంగాణ పోలీసు అధికారి జి. నాగన్న వేసిన రిట్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ అమర్‌నాధ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించి కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ మధ్య డీఎస్పీ, ఏఎస్‌పీ, ఎస్పీ(నాన్‌కేడర్‌)ల కేడర్‌ విభజన జరగాలి. ఆరేళ్లయినా ఈ ప్రక్రియ జరగలేదని గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతు ప్రేమంటే అది.. ఆవు కోసం హెలికాఫ్టర్ తెచ్చి...? (video)