జూన్‌ 15న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (10:10 IST)
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బిఐఈ) ఇంటర్‌ ఫలితాలను జూన్‌ 15న ప్రకటించనుంది. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ sbie.cgg.gov.inలో తనిఖీ చేసుకోవచ్చు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు.
 
కాగా కోవిడ్‌ కారణంగా గతేడాది ఆల్‌పాస్‌ ఫార్ములాను ప్రకటించిన ఇంటర్‌ బోర్డు ఈ ఏడాది పరీక్షల ఫలితాలను ప్రకటించిన తేదీ కంటే ముందుగానే విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. మే 6 నుంచి 24 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. 
 
ఐతే ఈ పరీక్షలు ప్రారంభమయినప్పనుంచి క్వశ్చన్‌ పేపర్లలో అక్షర దోషాలు, చేతితో రాసిన క్వశ్యన్‌ పేపర్ల పంపిణీ, ఒక పరీక్షకు బదులు మరో పరీక్ష పేపర్లను విద్యార్ధులకు ఇవ్వడం.. ఇలా పలురకాలుగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలతో వార్తల్లో నిలిచింది.
 
మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. టెన్త్‌ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది.  
 
ఈ ఏడాది జూన్‌లో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మాత్రమే తరగతులను ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జులై 1 నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments