ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణులు చెందిన విద్యార్థుల కంటే ఫెయిల్ అయిన విద్యార్థుల శాతమే అధికంగా ఉంది. బాగా చదివే విద్యార్థులు సైతం ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వీటిని ఏపీ మంత్రులు తిప్పకొడుతున్నారు. విద్యార్థులు సరిగా చదవలేదని అందుకే ఫెయిల్ అయ్యారంటూ సెలవిచ్చారు.
తాజాగా ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే.రోజా కూడా ఇదే పాటపాడారు. "తెలుగుదేశం అధికారంలో ఉన్న టీచర్లే ఇపుడూ ఉన్నారు. కోవిడ్ కారణంగా సరిగా చదువుకోకపోవడం వల్లనే కొంతమంది విద్యార్థులు పదో తరగి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు" అని మంత్రి వివరణ ఇచ్చారు.
పైగా, ఫెయిల్ అయిన విద్యార్థులకు సిప్లమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం ఇచ్చామని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు పాస్ అయిన వారికి రెగ్యులర్‌గా ఇచ్చే సర్టిఫికేట్లే ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా, పదో తరగతి పరీక్షల్లో మన రాష్ట్రం కంటే చాలా తక్కువ శాతం పాస్ అయిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయని ఆమె గుర్తుచేయడం కొసమెరుపు.