Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యం పెంపు కోసం ‘ఏఐ ఫర్ ఇండియా’ క్యాంపెయిన్‌

Advertiesment
image
, మంగళవారం, 7 జూన్ 2022 (20:23 IST)
ఇండియాను గ్లోబల్ డిజిటల్ ట్యాలెంట్ హబ్‌గా ప్రత్యేకించి ‘ప్రపంచానికి ఏఐ రాజధాని’గా చేసేందుకు, ద డేటా టెక్ ల్యాబ్స్ ఐఎన్‌సీ “ఏఐ ఫర్ ఇండియా” ప్రచారంతో ముందుకు వచ్చింది. నిన్న ఢిల్లీలో 100కు పైగా ఎంఎన్‌సీలు, ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్‌ల మధ్య కేంద్రం విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమాన్ని లాంఛ్ చేశారు. ఈ క్యాంపెయిన్- ఏఐ ఫర్ ఇండియా అనేది ఏడబ్ల్యూఎస్ ద్వారా పవర్డ్ చేయబడగా, విద్యా శాఖ (భారత ప్రభుత్వం) మరియు ఏఐసీటీఈలు మద్దతు అందిస్తున్నాయి. దీని ద్వారా 25 లక్షల మంది భారతీయ పౌరులను మూల్యాంకనం చేసి, శిక్షణ ఇచ్చి, సాధన, ఇంటర్న్‌షిప్ అందించి, ప్రాజెక్ట్‌లను కేటాయించడం, సర్టిఫై చేయడం మరియు ఉపాధి కల్పించాలనే లక్ష్యం నిర్ణయించుకున్నారు.
 
 
భారతీయ విద్యాశాఖా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు, ఏఐసీటీఈ ప్రొఫెసర్ అనిల్ డి. సహస్రబుధే, శ్రీ చంద్రశేఖర్ బుద్ధ- చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్- ఏఐసీటీఈ, డా. అమిత్ ఆండ్రే, ద డేటా టెక్ ల్యాబ్స్ సీఈఓ మరియు ఏడబ్ల్యూస్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్, ఇండియా, హెడ్ అయిన శ్రీ అమిత్ మెహతాతో ఇతర డెలిగేట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. “భారతదేశ నైపుణ్యం మరియు ప్రతిభను పెంపొందించడానికి ఇది ఒక గొప్ప అవకాశం, ఇంకా అవకాశాలతో కూడిన కెరీర్ అందించేందుకు, ప్రముఖ సంస్థలకు తాము కనిపించే అవకాశాన్ని విద్యార్థులకు అందిస్తుంది. ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము” అని ఏఐసీటీఈ చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్ చంద్రశేఖర్ బుద్ధ ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా అన్నారు.

 
“డేటాటెక్ చూపిస్తున్న ఈ చొరవ ప్రశంసనీయమైనది. యువతరానికి దృఢమైన భవిష్యత్తు నిర్మించే రూపంలో భాగంగా, సమాజానికి తమ వంతుకృషి అందించడానికి, ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ఇంకా ఇండియా వెలుగులోకి వచ్చేలా చేసేందుకు గాను, ప్రతిభకు ప్రతి వారి నుంచి మద్దతు మరియు గుర్తింపు అవసరం” అని ఏఐసీటీఈ ఛైర్మన్- అనిల్ సహస్రబుధే అన్నారు.

 
ద డేటా టెక్ ల్యాబ్స్ సీఈఓ, డాక్టర్ అమిత్ ఆండ్రే మాట్లాడుతూ, “డేటాటెక్ ల్యాబ్స్ ఈ దోహదపడటం చాలా విశేషంగా భావిస్తోంది. ఏఐ ఫర్ ఇండియా కార్యక్రమం సమ్మిళిత శ్రామిక శక్తి యుగానికి స్వాగతం పలుకుతోంది, దీనిలో ఇంటెలిజెంట్ టెక్నాలజీస్, మరియు వ్యాపార విజయం సాధించడంలో మనుషుల సహకారం, అలాగే భారత ఆర్థిక వ్యవస్థను నడపడానికి కూడా ఈ కార్యక్రమం సహకరిస్తుంది” అని తెలిపారు.
 
 
ఏఐ ఫర్ ఇండియాను 5 ఈవెంట్లుగా విభజించారు:
1. నేషనల్ ఫ్యూచర్ ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్ ఎగ్జామినేషన్: 8 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై అప్‌స్కిల్‌ కోసం చూసే వ్యక్తులకు ఏఐ అడాప్షన్‌ కోసం ఉద్దేశించబడింది.
 
2. ఆల్ ఇండియా స్కిల్ టు స్కేల్ అవెన్యూ: కరోనా మహమ్మారి సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన మరియు పరిశ్రమ అవసరాలతో పోలిస్తే నైపుణ్యాలలో అంతరం ఉన్న ప్రతి విద్యార్థికి మద్దతుగా నిలుస్తుంది.
 
3. ఏఐ ఐడియాథాన్: ఏఐ, డేటా, క్లౌడ్ మరియు అల్లైడ్ సైన్సెస్ సహాయంతో ఏదైనా మానవ కేంద్రీకృత జాతీయ సమస్యను పరిష్కరించడానికి ఆలోచనలను రూపొందించడానికి విద్యార్థులు, వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది.
 
4. ఆల్ ఇండియా డేటా ఇంజినీరింగ్ క్విజ్ కాంపిటీషన్: డేటా అనేది కొత్త ఆక్సిజన్, డొమైన్‌లు మరియు వర్టికల్స్‌లో డేటాపై జ్ఞానాన్ని విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
 
5. అల్ ఇండియా జాబథాన్ ఫర్ క్లౌడ్, డేటా అండ్ ఏఐ ఆస్పిరెంట్స్: పైన పేర్కొన్న వాటిలో ఏదైనా ఒకదానిలో పాల్గొని పూర్తి చేసిన భాగస్వామ్యం అయిన వారందరికీ ఇండియాలోని పరిశ్రమల నుండి 1,00,000 ఉద్యోగాలలో భాగమయ్యే అవకాశం అందించబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాక్టర్ నడిపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్